
Lok Sabha Election Exit Poll Results 2024 Highlights: లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది.. ఇంకా జూన్ 4న ఫలితాల విడుదలే మిగిలిఉంది.. శనివారం చివరి దశ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంతగా ఆరాటపడుతున్నాయో.. అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూశారు. దేశవ్యాప్తంగా పోల్ కోలాహాలం ముగిసిన వెంటనే నిబంధనలకు అనుగుణంగా ఎగ్జాట్లీ ఆరున్నరకు టీవీ9 ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను తెరపైకి తెచ్చింది. టీవీ9 – పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ 13 స్థానాలు, టీడీపీ 9 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుందని ప్రకటించింది.
ఎన్నికల్లో పోలింగ్ వరకు ఒక ఎత్తు అయితే.. కౌంటింగ్ ఒక్కటే ఒక ఎత్తు. తాము పడిన కష్టం ఫలించిందా? లేదా? అన్నది తేలేది ఫలితాల రోజునే.. దీని కోసం కళ్లలో వత్తులేసుకుని మరీ నిరీక్షస్తుంటాయి పార్టీలు, వారి కార్యకర్తలు. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఇస్తుంటారు. కానీ చివరి విడత పోలింగ్ ముగిసే దాకా ఎగ్జిట్ పోల్ ఇవ్వరాదన్న ఈసీ నిబంధనతో అందరూ.. చివరి దశ పోలింగ్ ముగిసే వరకు ఉసూరమంటూ నిరీక్షించారు. ఈ రోజు చివరి విడత కావటంతో అంతా ఎగ్జిట్ పోల్స్‌లో ఏమి తేలుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్‌ని ఇస్తాయా? ఎగ్జిట్ పోల్ ఎవరికి అనుకూలంగా ఉండనుంది..? ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొనగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కొంత క్లారిటీకి వచ్చారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఇంతకీ ఎగ్జిట్ పోల్ అనేది ఎలా సాగుతుంది? తెలుసుకుందాం.. పోలింగ్ బూత్‌లలో ఓటు వేసి వచ్చాక ఎగ్జిట్ పోల్ ప్రతినిధులు ఓటర్లకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఇది అన్ని పోలింగ్ కేంద్రాల్లో చేయరు. ఒటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీ పేరు చెప్పిందో లెక్క గట్టి నిర్వాహకులకు చేరవేస్తారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇలా వచ్చిన సమాచారాన్నంతా క్రోడీకరించి పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు. దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈ పద్ధతినే అవలంభిస్తాయి.
అంతేకాకుండా.. వివిధ వర్గాల ఓటర్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. దీన్ని బట్టి ఏ వర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిందో తెలుసుకుని ఆ వివరాల ఆధారంగా విశ్లేషణలు చేస్తారు. అన్ని వర్గాల శాంపిల్స్ తీసుకోవడం వల్ల అందరి ఆలోచనలు ప్రతిబింభిస్తాయని సర్వే సంస్థలు భావిస్తాయి. కొన్ని సర్వే సంస్థలు ఎప్పటి నుంచో ఈ ప్రక్రియను నిర్వహిస్తూ తమ ఆథెంటిసిటీని, క్రెడిబులిటీని కలిగి ఉంటాయి. వీటికి కూడా ప్రతి ఎన్నిక సవాల్ విసురుతూ ఉంటుంది. ఎందుకంటే వీరి సర్వేలో తేలిందానికి భిన్నంగా ఫలితాలు వస్తుంటాయి కొన్ని సార్లు. సీ- వోటర్, యాక్సిస్ మై ఇండియా, సీఎన్‌ఎక్స్ లాంటి కొన్ని ఏజెన్సీలు భారత్‌లో ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి.
ఎగ్జిట్ పోల్స్‌ను ఎవరు పడితే వారు.. ఎలా పడితే అలా నిర్వహించటానికి వీల్లేదు. దీనికీ కొన్ని నియమనిబంధనలున్నాయి. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. వీటికి ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ రూపొందించింది. ఎన్నికలను ఏ విధంగానూ ఇవి ప్రభావితం చేయరాదన్నది ఆ రూల్స్ సారంశం. అందుకే ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఓటింగ్ జరిగే సమయంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదన్నది ప్రాథమిక నిబంధన. అలాగే ఎన్నికలు మరో అరగంటలో ముగుస్తాయన్న సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదు. ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చాకే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది.
ఏపీ లోక్‌సభపై ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్
ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో బీజేపీకి భారీ ఆధిక్యం వస్తుందని ఇండియాటుడే అంచనావేసింది. 11 నుంచి 12 సీట్లు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది.
టైమ్స్ నౌ సర్వే .. వైసీపీ 14,, కూటమి 11 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం వుందని ప్రకటించింది.
డీ డైనమిక్స్ ఎగ్జిట్ పోల్స్
న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్
తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఇండి కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా, నేనా అనే పోరు కొనసాగిందని పీపుల్స్‌పల్స్ సర్వే వెల్లడించింది.
కాంగ్రెస్ 7-9, బీజేపీ 6-8, బీఆర్‌ఎస్ 0-1, ఎంఐఎం 1 గెలుపొందే అవకాశాలున్నట్లు పీపుల్స్‌పల్స్ పోస్ట్ పోల్ సర్వే తెలిపింది.
CNX ఎగ్జిట్ పోల్స్
ఏపీ లోక్‌సభ: TDP 13-15, BJP 4-6, YCP 3-5, జనసేన 2
రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్‌పోల్స్: వైసీపీ 158, టీడీపీ కూటమి 4-17, కీ కంటెస్ట్-13
స్మార్ట్ పోల్స్ : స్మార్ట్ పోల్: వైసీపీ 82(+/-8), కూటమి 93(+/-8)
జన్‌మత్ పోల్స్ : జన్‌మత్ పోల్స్: వైసీపీ 95-103, టీడీపీ 67-75
చాణక్య స్ట్రాటజీస్ : చాణక్య స్ట్రాటజీస్: వైసీపీ 39-49, టీడీపీ 114-125
పొలిటికల్ లాబొరేటరీ ఎగ్జిట్ పోల్ : వైసీపీ 108(+/-5), కూటమి 67(+/-5)
పార్థదాస్ ఎగ్జిట్‌పోల్స్ : ఏపీ అసెంబ్లీ: వైసీపీ 110-120, టీడీపీ కూటమి 55-65
రిపబ్లిక్-మ్యాట్రిజ్ సర్వే
రిపబ్లిక్- పి.మార్క్
రాప్ స్ట్రాటజీస్ ఎగ్జిట్‌పోల్స్..
వైసీపీ 158, టీడీపీ కూటమి 4-17, కీ కంటెస్ట్-13
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్..
NDA 362 -392
ఇండి కూటమి 141 -161
ఇతరులు 10-20
ABP CVOTER సర్వే.. ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని.. ABP C VOTER సర్వే అంచనా వేసింది
బీజేపీ : 7-9
INC : 7-9
BRS: 0
AIMIM : 0-1
వైసీపీదే అధికారమని.. ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది.
175 సీట్లలో..
వైసీపీ 94-104
టీడీపీ కూటమి 71-81
25 లోక్ సభ సీట్లలో
వైసిపి 13-15
టిడిపి 10-12
వైసీపీదే అధికారమని.. ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది.
175 సీట్లలో..
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం..
NDA 353-368, ఇండి కూటమి 118-133, ఇతరులు 43-48
చాణక్య స్ట్రాటజీస్
స్మార్ట్ పోల్ సర్వే…
పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం
రిపబ్లిక్-పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్..
NDA 359, ఇండి కూటమి 154, ఇతరులు 30
ఇండియా న్యూస్ ఎగ్జిట్‌పోల్స్..
NDA 371, ఇండి కూటమి 125
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
NDA 359, ఇండి కూటమి 154, ఇతరులు 30
పార్థ ఎగ్జిట్‌పోల్స్ సర్వే..
వైసీపీ 110-120
టీడీపీ కూటమి 55-65
(వైసీపీకి 55 శాతం ఓటింగ్ – టీడీపీ కూటమికి 46 శాతం ఓటింగ్, కాంగ్రెస్‌కు 2.5 శాతం ఓటింగ్)
ఆత్మసాక్షి సంస్థ ఎగ్జిట్ పోల్స్ వివరాలు..
స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రిసమ్ సంస్థ అంచనావేసింది.. 175 సీట్లలో
5 స్థానాలు అటుఇటుగా ఉంటాయని అంచనావేసింది.
ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం ఉంటుందని రేస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.
వస్తాయని రేస్ సంస్థ అంచనావేిసంది.
మొత్తం 543 స్థానాల్లో అంచనాలు ఇలా ఉంటాయని టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ వెల్లడించింది.
లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దీంతో ఎగ్జిట్‌పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంతగా ఆరాటపడుతున్నాయో.. అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మరో అరగంటలో ఎగ్జిట్‌పోల్ లెక్కలొస్తాయి. ఫలితాల కోసం ఎంత ఉత్కంఠగా ప్రజలు ఎదురుచూస్తున్నారో.. అంతే ఆసక్తి రేపుతోంది ఎగ్జిట్‌పోల్. వీటి ఆధారంగానే దాదాపు అందరూ ఓ నిర్ణయానికి వస్తారు. ప్రీపోల్ సర్వే ఎలా ఉన్నా.. ఓటు వేసి వచ్చిన తర్వాత ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఒక్కటే కీలకమని భావిస్తుంటారు అంతా. అయితే ఎగ్జిట్ పోల్ లెక్కలు తారుమారు అయిన సందర్భాలూ ఉన్నాయి. అయినా వాటికున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల కీలక సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ. తేజస్వి యాదవ్ , డీ.రాజా , అఖిలేశ్ యాదవ్ , తేజస్వి యాదవ్ , కేజ్రీవాల్ , ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ , లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఎన్నికల తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.
కాసేపట్లోనే ఎగ్జిట్‌పోల్స్ వెలువడనున్నాయి. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంతగా ఆరాటపడుతున్నాయో.. అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో అయితే హైటెన్షన్ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై అంతటా రచ్చ జరుగుతోంది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జనాలు.. ఎగ్జిట్ పోల్స్ చూసి కాస్తైనా టెన్షన్ తగ్గించుకోవాలనుకుంటున్నారు.
ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో చాలా సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీ వైపే మొగ్గు చూపాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 20 స్థానాలకు దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయి.
గత రెండు పార్లమెంట్ ఎన్నికల వాస్తవ ఫలితాలతో ఎగ్జిట్ పోల్స్‌ను సరిచూసినప్పుడు 2019 ఎన్నికల్లో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఈ రెండు సంస్థలు వెల్లడించిన ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దాదాపు దగ్గరగా వచ్చాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏ కూటమికి 339 నుంచి 365 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అలాగే యూపీఏకి 77 నుంచి 180 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. టుడేస్ చాణక్య విషయానికి వస్తే ఎన్డీఏకి సుమారు 350 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే యూపీఏకి సుమారు 95 సీట్లు రావచ్చని చెప్పింది. చివరిగా ఫలితాలు వెల్లడైన తర్వాత ఎన్డీఏకి 353 సీట్లు రాగా, యూపీఏ 91 స్థానాల్లో విజయం సాధించింది. అలా చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినప్పటికీ ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య సంస్థలు వెల్లడించిన ఎగ్టిట్ పోల్స్ మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.
పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఏ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించారు? ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు? ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ పలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తారు. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంత మంది కొట్టి పారేస్తారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్‌కు విరుద్ధంగా కొన్ని సార్లు ఫలితాలు వెల్లడవుతుంటాయి. 2004లో ఇలాగే జరిగింది. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ వాజ్‌పేయ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది.
పోలింగ్ ఘట్టం చివరి దశకు వచ్చింది. ఏడో విడత పోలింగ్ ప్రక్రియ ముగియగానే సాయంత్రం ఆరుగంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. పలు టీవీ ఛానెల్స్ చర్చా కార్యక్రమాలు నిర్వహించి.. వాటి అంచనాలను వెల్లడించనున్నాయి.