TV9 Exit Poll Results 2024: మూడోసారి మోదీనే.. టీవీ9-పోల్ స్ట్రాట్ బిగ్ ఎగ్జిట్ పోల్ సర్వే.. అంచనాలు ఎలా ఉన్నాయంటే

లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది.. ఇంకా ఫలితాల విడుదలే మిగిలిఉంది.. శనివారం చివరి దశ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంతగా ఆరాటపడుతున్నాయో.. అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

TV9 Exit Poll Results 2024: మూడోసారి మోదీనే.. టీవీ9-పోల్ స్ట్రాట్ బిగ్ ఎగ్జిట్ పోల్ సర్వే.. అంచనాలు ఎలా ఉన్నాయంటే
LoK Sabha Elections

Updated on: Jun 01, 2024 | 6:35 PM

లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసింది.. ఇంకా ఫలితాల విడుదలే మిగిలిఉంది.. శనివారం చివరి దశ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడుదల చేయాలని మీడియా సంస్థలు ఎంతగా ఆరాటపడుతున్నాయో.. అంతకంటే ఎక్కువ ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో సైతం హైటెన్షన్‌ నెలకొంది. ఏడో దశ ఎన్నికల ముగియడంతో టీవీ9 నెట్‌వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించింది. టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది.

543 లోక్ సభ స్థానాల్లో..

  • బీజేపీ -305
  • ఎన్డీఏ కూటమి -340
  • కాంగ్రెస్ -65
  • ఇండియా కూటమి-167
  • ఇతరులు-36

మొత్తం 543 స్థానాల్లో అంచనాలు ఇలా ఉంటాయని టీవీ9 పోల్ స్ట్రాట్, పీపుల్స్ ఇన్‌సైట్ వెల్లడించింది.