Kangana Ranaut: ‘బీఫ్ తినను, హిందువుగా గర్విస్తున్నాను’.. కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై కంగనా క్లారిటీ!

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది.

Kangana Ranaut: బీఫ్ తినను, హిందువుగా గర్విస్తున్నాను.. కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై కంగనా క్లారిటీ!
Kangana Ranaut

Updated on: Apr 08, 2024 | 4:48 PM

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది.

తాను బీఫ్‌తో పాటు ఎలాంటి మాంసాహారం తిననని, తన గురించి కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి పుకార్లు వ్యాపింప చేయడం సిగ్గుచేటని ట్వీట్‌ చేశారు. తాను యోగాతో పాటు ఆయుర్వేదాన్ని నమ్ముకుంటానని అన్నారు. తాను సనాతన హిందుత్వాన్ని నమ్ముతానని , ఈవిషయం ప్రజలకు తెలుసన్నారు. వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరంటూ ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వేదిక పేర్కొన్నారు. కంగనాను కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌ చేయడం ఇది తొలిసారి కాదు… కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనథే కంగనాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది.

కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనెట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కంగనా రనౌత్‌పై అభ్యంతరకరమైన పోస్ట్ షేర్ చేయడంతో వివాదం తలెత్తింది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా కంగనా రనౌత్‌ను బరిలోకి దింపిన ఒక రోజు తర్వాత చేసిన ఈ పోస్ట్, కంగనా రనౌత్ చిల్లర దుస్తులతో ఉన్న చిత్రాన్ని అవమానకరమైన శీర్షికతో షేర్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..