Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణంలో మరో షాక్.. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు

ఆమ్ ఆద్మీ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా చాలా మంది ముఖ్య నాయకులు ED లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో నేత చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు ​​పంపింది.

Delhi Liquor Scam Case:  మద్యం కుంభకోణంలో మరో షాక్.. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు
Aap Mla Durgesh Pathak
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 08, 2024 | 5:15 PM

ఆమ్ ఆద్మీ పార్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా చాలా మంది ముఖ్య నాయకులు ED లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో నేత చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు ​​పంపింది. దీంతో ఈడీ కార్యాలయానికి చేరుకున్న పాఠక్‌ను విచారించారు ఈడీ అధికారులు.

అదే సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ విభవ్ కుమార్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. దీనికి ముందు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విభవ్ కుమార్, దుర్గేష్ పాఠక్‌లను విచారించింది. దుర్గేష్ పాఠక్ ఫోన్‌ను ఈడీ జప్తు చేసి విచారణకు పిలిచినట్లు సమాచారం.

కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ప్రకటన వెలుగులోకి వచ్చింది. బీజేపీ కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అతిషీ ధ్వజమెత్తారు. ఈడీ, బీజేపీ మధ్య రాజకీయ పొత్తు ఉందని మంత్రి అరోపించారు. ఈడీ ద్వారా ఎన్నికల ప్రచారం నుంచి ఆప్ పార్టీ నేతలను తొలగించాలని బీజేపీ భావిస్తోంది.

ఇదిలావుంటే మద్యం పాలసీ స్కామ్‌లో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు దుర్గేష్ పాఠక్ ఈడీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ఆయన పేరు తెరపైకి వచ్చింది. దుర్గేష్ పాఠక్ ఢిల్లీలోని రాజిందర్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అవిర్భావం నుండి పార్టీతో అనుబంధం ఉన్న పాత నాయకులలో ఆయన ఒకరు. అలాగే గోవా ఎన్నికల్లో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు.

మద్యం కుంభకోణం ఆమ్ ఆద్మీ పార్టీకి మెడలో ముల్లులా మారుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. అటు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సైతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితమే సంజయ్ సింగ్ బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…