Liquor Policy Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. హైదరాబాద్ లో కూడా..

|

Sep 16, 2022 | 1:11 PM

ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లో..

Liquor Policy Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం.. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు.. హైదరాబాద్ లో కూడా..
Liquor
Follow us on

Liquor Policy Scam: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంలో ఈడీ (ED) దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్‌, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆయా ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

అంతకుముందు సెప్టెంబర్ 6న మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లోని 35కి చోట్లకు పైగా ఈడీ సోదాలు నిర్వహించింది. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి