AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi-Kumbh Mela: కుంభమేళాపై కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరి సాధువులు వినేనా..?

PM Modi-Kumbh Mela: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే.. కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని..

PM Modi-Kumbh Mela:  కుంభమేళాపై కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మరి సాధువులు వినేనా..?
Pm Modi
Shiva Prajapati
|

Updated on: Apr 17, 2021 | 1:12 PM

Share

PM Modi-Kumbh Mela: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలోనే.. కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం నాడు ట్విట్ చేశారు. గతవారం హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా తరువాత చాలా మంది సాధువులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఈ కుంభమేళాపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ సాధువులకు విజ్ఞప్తి చేస్తూ కుంభమేళాను ప్రతీకాత్మకంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రెండు రాజ స్నానాలు(షాహీ స్నాన్) పూర్తి అయినందున.. తదుపరి కార్యక్రమాలను భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించాలని స్వామి అవధేశానంద్ గిరిని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించడం వలన కరోనా మహమ్మారి వ్యా్ప్తిని నిలువరించవచ్చు అని ప్రధాని పేర్కొన్నారు. కాగా, కుంభమేళా సందర్భంగా చాలా మంది సాధువులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ స్వామి అవధేషానంద్ గిరితో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా సోకిన సాధువులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ వారికి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి ప్రకటించారు. ‘ప్రధాన షాహి స్నాన్ ముగిసింది. మన అఖాడాలో చాలా మంది కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కుంభమేళా ముగిస్తు్న్నాం.’ అని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై మరో ఇతర అఖాడాలకు చెందిన సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా ముగింపుపై ప్రకటన చేసే హక్కు ఏ ఒక్కరికీ లేదని, అది ముఖ్యమంత్రి మాత్రమే చేయాలని నిర్వాణి అఖాడా అధ్యక్షుడు మహంత్ ధర్మదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇతర అఖాడాల సమ్మతి లేకుండా కుంభమే ముగిసిందంటూ ప్రకటించి భక్తులలో గందరగోళం సృష్టించిన నిరంజని అఖాడా పరిషత్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. లేదంటే నిరంజని అఖాడాను దూరం పెట్టాల్సి ఉంటుంది’ అని మహంత్ ధర్మదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

PM Modi Tweet:

Also read:

నాగదోషానికి యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. కన్న బిడ్డనే కడతేర్చింది.. సూర్యాపేట కేసులో షాకింగ్ విషయాలు..

Viral Video: సుశాంత్ మూవీ ‘నమో నమో శంకర’ సాంగ్ ఏనుగు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. వీడియో వైరల్

Running: రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణీకుల పరుగో పరుగు.. ఆందోళనలో అధికారులు..ఎందుకంటే..?