AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard: చిరుత పులుల సంఖ్య పెరిగింది..తొలిసారిగా అధికారిక లెక్కలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయంటే..

సింహాలు, పెద్ద పులుల తరువాత ఎక్కువగా అడవుల్లో క్రూరమృగాలుగా చెప్పుకునే పేరు చిరుత పులి. వేగానికి సింబాలిక్ గా చిరుతను చెబుతారు. అదేవిధంగా పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణలో పెద్దపులుల తర్వాత చిరుతలదే కీలక పాత్ర.

Leopard: చిరుత పులుల సంఖ్య పెరిగింది..తొలిసారిగా అధికారిక లెక్కలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం..తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయంటే..
Leopard
KVD Varma
|

Updated on: Apr 14, 2021 | 5:11 PM

Share

Leopard:  సింహాలు, పెద్ద పులుల తరువాత ఎక్కువగా అడవుల్లో క్రూరమృగాలుగా చెప్పుకునే పేరు చిరుత పులి. వేగానికి సింబాలిక్ గా చిరుతను చెబుతారు. అదేవిధంగా పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణలో పెద్దపులుల తర్వాత చిరుతలదే కీలక పాత్ర. అలాగే, చిరుతలు ‘కీ స్టోన్‌’ స్పీషీస్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. పెద్దపులుల లెక్కలను తీసుకున్నట్టే.. చిరుతపులుల లెక్కలు కూడా తీస్తుంటారు అధికారులు. శాస్త్రీయ పద్ధతుల్లో.. చిరుతపులుల లెక్కలు కడతారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇలా లెక్కించిన చిరుత పులుల లెక్కల వివరాలను మొట్టమొదటిసారిగా అధికారికంగా వెల్లడించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎన్ని చిరుతలున్నాయనే దానిపై అధికారిక గణాంకాలు వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 826 చిరుతలున్నట్టుగా అధికారికంగా వెల్లడైంది.

ఇక ఈ లెక్కలు వెల్లడించిన స్టేటస్‌ ఆఫ్‌ లెపర్డ్స్‌ ఇన్‌ ఇండియా నివేదికలో.. దేశంలో మొత్తం 12,852 చిరుత పులులున్నట్లుగా అంచనా వేశారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,421 చిరుతలు ఉన్నాయి. ఇక పశ్చిమ కనుమల్లో భాగంగా ఉన్న కర్నాటక 1,783 చిరుతలతో రెండో స్థానంలో ఉంది. ఈస్ట్రన్‌ ఘాట్లలో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర 1,690 చిరుతలతో మూడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 492, తెలంగాణలో 334 చిరుతలున్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. 2014లో దేశంలో దాదాపు 7,900 చిరుతలు ఉండగా 2018 నాటికి వాటి సంఖ్య 12,852కు (దాదాపు 60 శాతం) పెరగడం గమనార్హం.

దేశంలో పులులు, చిరుతల సంరక్షణకు చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలప్రదం అవుతున్నాయనే విషయంపై నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రాల అటవీశాఖలు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా వీటి సంఖ్యను శాస్త్రీయంగా గణిస్తోంది.

పెద్ద పులుల లానే రెండేళ్లకు పైబడిన చిరుతలు అడల్ట్ గా చెబుతారు. మరి ఈ చిరుతల జీవన విధానం ఎలా ఉంటుందంటే.. రెండున్నరేళ్ల నుంచే అది సంతానోత్పత్తి మొదలుపెడుతుంది. 10 ఏళ్ల వయసు వచ్చేవరకు పిల్లలను పెడుతుంది. చిరుతలు సహజమైన అడవుల్లో 14, 15 ఏళ్ల పాటు జీవిస్తాయి. ఇక ఆహారం, వైద్యం అందుబాటులో ఉండటంతో పాటు ఇతర జంతువుల నుంచి ప్రాణహాని ఉండదు కాబట్టి జూలలో 17, 18 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉంటుంది. చిరుతలు పెద్దగా బరువు పెరగవు. గరిష్టంగా 55-60 కేజీల వరకు బరువుంటాయి. అందువల్లే వేగంగా పరిగెత్త గలుగుతాయి. అలవోకగా చెట్లు ఎక్కేయగలుగుతాయి. ఆహారం కూడా రోజుకు రెండు కేజీల మేర సరిపోతుంది.

Also Read: Sachin Vaze: పేలుడు పదార్ధాల కారు.. పోలీసు అధికారి సచిన్ వాజే.. సస్పెన్స్ థ్రిల్లర్ రియల్ క్రైమ్ స్టోరీలో మరో ట్విస్ట్!

CBSE 10th Exam 2021: సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు.. విద్యార్థులను ఎలా ప్రమోట్‌ చేస్తారో తెలుసా..?