Uttar Pradesh: నేనూ వాదిస్తా.. నా క్లైంట్‌కి న్యాయం చేస్తానంటూ కోర్టులోకి దూసుకొచ్చిన ‘చిరుతపులి’.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..

యూపీలోని ఘజియాబాద్ కోర్టులో చిరుతపులి కలకలం సృష్టించింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన చిరుతపులి అక్కడ చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ అడ్వొకేట్‌తో పాటు, మరో వ్యక్తిని గాయపరిచింది.

Uttar Pradesh: నేనూ వాదిస్తా.. నా క్లైంట్‌కి న్యాయం చేస్తానంటూ కోర్టులోకి దూసుకొచ్చిన ‘చిరుతపులి’.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్..
Leopard

Updated on: Feb 09, 2023 | 6:24 AM

యూపీలోని ఘజియాబాద్ కోర్టులో చిరుతపులి కలకలం సృష్టించింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన చిరుతపులి అక్కడ చెప్పులు కుట్టే వ్యక్తి, ఓ అడ్వొకేట్‌తో పాటు, మరో వ్యక్తిని గాయపరిచింది. సీజేఎం కోర్టు కార్యాలయం వద్ద చిరుత పులి పోలీస్‌పై దాడి చేసి గాయపరిచింది. ఆ తర్వాత ఐఎంటీ వైపు నుంచి అకస్మాత్తుగా కోర్టులోకి ప్రవేశించింది. అనంతరం మొదటి అంతస్తులోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులోకి దూరింది. ఒక్కసారిగా కోర్టు ఆవరణలోకి చిరుత పులి రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు.

ఇక జనాల హడావుడితో బెదిరిపోయిన చిరుత అక్కడే ఉన్న చెప్పులు కుట్టే వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపైనా దాడి చేసింది. ఓ మహిళా అడ్వొకేట్ తీవ్రంగా గాయపడగా ఆమెను.. ఆస్పత్రికి తరలించారు. డిసెంబరులో నోయిడా సమీపంలో ఓ చిరుతను చూసినట్టు కొంతమంది తెలిపారు. బహుశా ఆ చిరుత పులే ఇప్పుడు ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ప్రవేశించిందా అని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..