Polavaram: పోలవరం ప్రాజెక్టును నిరసిస్తూ న్యాయవాది సైకిల్ యాత్ర.. అసలు కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్‎లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‎ను నిరసిస్తూ ఒడిశాలో పలు రూపాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా మాల్కాన్‎గిరికి చెందిన ఒక లాయర్ సైకిల్ యాత్రతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మల్కాన్ గిరి నుంచి పూరి వరకు ఈ నిరసన యాత్ర కొనసాగించారు. లంబోధర్ తురుక్.. మోటు నుండి తన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించి పూరీకి వెళ్ళే మార్గంలో చాలా ఘాట్‌లు, అరణ్యాలను దాటుకుంటూ 20 రోజులు‎గా తన నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు న్యాయవాది.

Polavaram: పోలవరం ప్రాజెక్టును నిరసిస్తూ న్యాయవాది సైకిల్ యాత్ర.. అసలు కారణం ఇదే..
Odisha Lawyer

Edited By:

Updated on: Jan 02, 2024 | 1:31 PM

ఆంధ్రప్రదేశ్‎లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‎ను నిరసిస్తూ ఒడిశాలో పలు రూపాలలో నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా మాల్కాన్‎గిరికి చెందిన ఒక లాయర్ సైకిల్ యాత్రతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మల్కాన్ గిరి నుంచి పూరి వరకు ఈ నిరసన యాత్ర కొనసాగించారు. లంబోధర్ తురుక్.. మోటు నుండి తన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించి పూరీకి వెళ్ళే మార్గంలో చాలా ఘాట్‌లు, అరణ్యాలను దాటుకుంటూ 20 రోజులు‎గా తన నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు న్యాయవాది. సబేరి మరియు సిలేరు నది సంగమం నుండి నీటిని సేకరించిన తర్వాత న్యాయవాది లంబోధర్ తురుక్ మోటు నుండి బయలుదేరారు. అతను పూరీకి వెళ్ళే మార్గంలో చాలా ఘాట్‌లు మరియు అరణ్యాలను దాటాడు, దీనికి అతనికి 20 రోజులు పట్టింది. పూరి జగన్నాధ్ దర్శనం అనంతరం తురుక్ మోటు నుండి తెచ్చిన నీటిని సముద్రంలో పోసి తన నిరసనను పూర్తి చేయనున్నారు.

న్యాయవాది తురక్ డిమాండ్ ఇదే

న్యాయవాది తురుక్ తన డిమాండ్ల గురించి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు కారణంగా మల్కన్‌గిరిలోని 130 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. దీంతో ఆ గ్రామాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందనీ ఆవేదన వ్యక్తం చేశాడు. వేల హెక్టార్ల అటవీ భూమి కూడా ప్రాజెక్ట్ గర్భంలో కలిసి పోతుందని విచారం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఫలించకూడదని పూరీ జగన్నాథుని సన్నిధిని ప్రార్థించేందుకు వచ్చాననీ తెలిపారు. అందుకే నదుల సంగమం నుంచి నీళ్లు తీసుకొచ్చానన్నారు లాయర్ తురక్. ఆ నీటిని సముద్రంలోకి సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తనన్నారు.

పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాలలో నీటిపారుదల ప్రయోజనాలను అందించే బహుళార్ధసాధక ప్రాజెక్టు. ఇది విశాఖపట్నం టౌన్‌షిప్, మార్గమధ్యంలోని ఇతర పట్టణాలు, గ్రామాలకు త్రాగునీటిని సరఫరా చేస్తుంది. విశాఖపట్నం తీర ఆధారిత స్టీల్ ప్లాంట్, చుట్టుపక్కల ఉన్న ఇతర పరిశ్రమలకు పారిశ్రామిక నీటి సరఫరాను కూడా అందించే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఇది హైడల్ పవర్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం గ్రామానికి సమీపంలో కొవ్వూరు – రాజమండ్రి రహదారికి 34 కిమీ, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 42 కిమీ ఎగువన నిర్మాణ దశలో ఉంది. రిజర్వాయర్‌లోని అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొంటూ ఒడిశా ఈ ప్రాజెక్టును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏదో ఒక రూపంలో ఒడిశాలో నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. తాజాగా ఈ లాయర్ సైకిల్ యాత్ర ద్వారా మరోసారి ఈ నిరసన బహిర్గతమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..