Bihar Land For Job Scam: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో నేడు సీబీఐ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్..

|

Mar 07, 2023 | 10:55 AM

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో సీబీఐ బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని విచారించిన సీబీఐ ఈ రోజు (మార్చి 7) లాలూను విచారించబోతోంది..

Bihar Land For Job Scam: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో నేడు సీబీఐ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్..
Lalu Prasad Yadav
Follow us on

ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కేసులో సీబీఐ బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని విచారించిన సీబీఐ ఈ రోజు (మార్చి 7) లాలూను విచారించబోతోంది. ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. మంగళవారం సీబీఐ లాలూను ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇప్పటికే బీహార్‌ మాజీ సీఎం , లాలూ సతీమణి రబ్రీదేవిని సీబీఐ విచారించింది. ఐదుగంటల పాటు ఆమెను విచారించారు.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్‌ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను సీబీఐ విచారిస్తోంది. సీబీఐ ఛార్జిషీట్‌లో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీతో పాటు 14 మంది పేర్లు ఉన్నాయి . సీబీఐ అధికారులు రబ్రీ ఇంటికి వచ్చిన సమయంలో.. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అక్కడే ఉన్నారు. ఆమె తర్వాత లాలూ వంతు వచ్చింది. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.