Lalu Prasad Yadav: బిహార్‎లో ఈడీ సోదాలు.. లాలు, తేజస్వీలపై కొనసాగుతున్న విచారణ..

|

Jan 30, 2024 | 3:15 PM

బిహార్‌లో పొలిటికల్‌ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యారు తేజస్వి. ఈ సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు లాలూ, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ విచారణను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది.

Lalu Prasad Yadav: బిహార్‎లో ఈడీ సోదాలు.. లాలు, తేజస్వీలపై కొనసాగుతున్న విచారణ..
Lalu Prasad Yadav Ed Investigation
Follow us on

పాట్నా, జనవరి 30: బిహార్‌లో పొలిటికల్‌ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ విచారణకు హాజరయ్యారు తేజస్వి. ఈ సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. మరోవైపు లాలూ, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ విచారణను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. నిన్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఈడీ సుమారు తొమ్మిది గంటల పాటు విచారించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 9న హాజరు కావాలని అమిత్ కత్యాల్, రబ్రీ దేవి, మీసా భారతికి PMLA కోర్టు నోటీసులు జారీ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న 2004, 2009 మధ్య కాలంలో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో ఆయన ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో లాలూతో పాటు అప్పటి రైల్వే జనరల్ మేనేజర్ పేరు ఛార్జ్‌షీట్‌లో ఉంది. అప్పట్లో పొందిన భూములను లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, వారి కుమార్తె మిసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ గతేడాది అక్టోబర్‌లో చార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వేలో ఉద్యోగానికి బదులుగా భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. అదే సమయంలో మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. సింగపూర్‌లో ఉన్న లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య, తన తండ్రితో ఈడీ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ఆయనతో పాటు ఏ సహాయకుడిని అనుమతించకుండా అమానవీయ ప్రవర్తనను విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఆమె తన నిరుత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ తెలుసు.. ఆయన ఒకరి సాయం లేకుండా నడవలేరు. అయినప్పటికీ, ఈడీ అధికారులు తమ కార్యాలయంలోకి సహాయకుడిని అనుమతించలేదు. “మా నాన్నకి ఏదైనా జరిగితే, నా కంటే దారుణంగా ఎవరూ ఉండరు. ఈరోజు మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ, ఈడీతో పాటు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సింహం (లాలూ) ఒంటరిగా ఉన్నంతమాత్రాన బలహీనమైనది కాదు” అని ఆమె అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..