Doctor Selling Panipuri: పాణీపూరి, పరాఠాలు అమ్ముకుంటోన్న డాక్టర్లు.. అసలుకారణం ఇదే..

|

Mar 27, 2023 | 9:18 AM

సీకర్‌ జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద వైద్యులు ధర్నాకు దిగారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలుచోట్ల వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సమ్మె కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా చాలా రోజులుగా మూతపడి ఉన్నాయి. ఈ క్రమంలో సీకర్‌లోని తాళం వేసిన ఆసుపత్రి ముందు

Doctor Selling Panipuri: పాణీపూరి, పరాఠాలు అమ్ముకుంటోన్న డాక్టర్లు.. అసలుకారణం ఇదే..
Lady Doctor Selling Panipur
Follow us on

ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాజస్థాన్‌లో వైద్యుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీకర్‌ జిల్లాలోని కలెక్టరేట్‌ వద్ద వైద్యులు ధర్నాకు దిగారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలుచోట్ల వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సమ్మె కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా చాలా రోజులుగా మూతపడి ఉన్నాయి. ఈ క్రమంలో సీకర్‌లోని తాళం వేసిన ఆసుపత్రి ముందు లేడీ డాక్టర్‌ అనితా చౌదరి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న ఆసుపత్రి ముందు పానీపూరి స్టాల్‌పెట్టి, అందరికీ విక్రయించడం ప్రారంభించారు. మరో వైద్యుడు తన ఆసుపత్రిని పరాఠా సెంటర్‌గా మార్చాడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య హక్కు బిల్లును ఉపసంహరించుకునేంతవరకూ ఈ విధంగా నిసనలు కొనసాగుతూనే ఉంటాయని వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌టీహెచ్‌ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే వైద్యులు తమ కుటుంబాలతో కలిసి జైపూర్‌లో మహా ఆక్రోశ్‌ ర్యాలీ చేపట్టి నిరసన తెలుపుతామన్నారు.

కాగా రాజస్థాన్‌లోని అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ‘రైట్‌ టు హెల్త్‌’ ఆరోగ్య బిల్లును ఆ రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెల్పింది. దీంతో ఆర్టీహెచ్ చట్టం రూపం దాల్చింది. ఈ చట్టం ప్రకారం.. ఆ రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందే అవకాశం కల్పించారు. ఈ చట్టం పేరుతో రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. అక్కడి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులను మూసి, ఆరోగ్య బిల్లును ఉపసంహరించుకోవాలని రోడ్డెక్కారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిరసనల అణచివేత చర్యలకు పూనుకుంది. వైద్యుల నిరసనల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైద్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.