ESIC Pension Covid: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని ఎంతలా అతలకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఇంట్లో సంపాదించే వారికి కోల్పోవడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయి. ఇలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈసీఐ కార్డు కలిగి ఉండి కరోనా కారణంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాఆజగా కోవిడ్ 19 రిలీఫ్ పథకం కింద ఈ కొత్త విధానానికి నాంది పలికారు. ఈఎస్ఐ కార్డు ఉన్న వ్యక్తి కరోనా కారణంగా మరణిస్తే ఆయన కుటుంబానికి ప్రతీనెల కనీసం రూ. 1800 పెన్షన్ ఇవ్వనున్నారు. డబ్బు సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ అందుతుందని బీమా కమిషనర్ ఎంకె శర్మ తెలిపారు. ఇక ఈ పెన్షన్ పొందడానికి అర్హతల విషయానికొస్తే.. ఈఎస్ఐ కార్డుతో పాటు సదరు ఉద్యోగి కరోనా సోకే కంటే మూడు నెలలపాటు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తుండాలి. ఇలా అయితే మరణించిన ఆ ఉద్యోగి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జూలై1 నుంచి పెరగనున్న వేతనాలు