శ్రద్ధా వాకర్ హత్య​తరహాలో మరో దారుణం.. హోటల్‌ ఓనర్‌ను చంపి.. ముక్కలుగా నరికి..

శ్రద్ధా వాకర్ హత్య​తరహాలో కేరళలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ హోటల్​ యజమానిని ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి అత్యంత కిరాతకంగా చంపేశారు.. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్​లో తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో విసిరేశారు.

శ్రద్ధా వాకర్ హత్య​తరహాలో మరో దారుణం.. హోటల్‌ ఓనర్‌ను చంపి.. ముక్కలుగా నరికి..
Kerala Crime News
Follow us

|

Updated on: May 27, 2023 | 11:10 AM

శ్రద్ధా వాకర్ హత్య​తరహాలో కేరళలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ హోటల్​ యజమానిని ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి అత్యంత కిరాతకంగా చంపేశారు.. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్​లో తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో విసిరేశారు. కోజీకోడ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఒలవన్నాలో సిద్ధిఖ్ (58) అనే హోటల్ యజమానిని ఇంత దారుణంగా హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీన్‌లో పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే హోటల్‌ నుంచి నిందితులు హోటల్ నుంచి పరాయ్యారు. వారు హోటల్ లో పనిచేసే సిబ్బంది శిబిలి (22), ఫర్హానా (18)గా గుర్తించారు. వారిద్దరూ అనుమానం రాకుండా చెన్నై చేరుకోగా.. కేరళ పోలీసుల సమాచారంతో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేరళ పోలీసులకు అప్పగించారు.

వారిద్దరూ హత్య చేసిన తర్వాత సిద్ధిఖ్ ను ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం మృతదేహం శరీర భాగాలను ఓ సూట్ కేస్ లో వేసి.. అట్టపాడి పాస్​వద్ద పడేశారని పోలీసులు తెలిపారు. ఆ సూట్ కేసును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌లోనూ కొన్ని సిద్ధిఖ్‌ శరీర భాగాలను గుర్తించినట్లు పేర్కొంటున్నారు. అనంతరం శరీర భాగాలను పోలీసులు పోస్ట్​మార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

హత్య జరిగిన సమయంలో హోటల్ గదిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పాలక్కడ్‌కు చెందిన మరో వ్యక్తి​ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, హోటల్ ఓనర్‌ సిద్ధిఖ్‌కు, హోటల్‌ సిబ్బంది శిబిల్, ఫర్హానాకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..