టీవీ9 బంగ్లా జర్నలిస్ట్ స్వర్ణేందు దాస్ కన్నుమూత.. సంతాపం తెలిపిన టీవీ9 ఫ్యామిలి..

|

Aug 23, 2022 | 4:27 PM

టీవీ9 నెట్ వర్క్ లో భాగమైన టీవీ9బంగ్లాలో రిపోర్టరుగా పనిచేస్తున్న స్వర్ణేందు దాస్ అనారోగ్యం కారణంగా ఈరోజు తుదిశ్వాస విడిచారు. అతడి వయస్సు 35 సంవత్సరాలు. 2014లో అతడు ప్రాణంతాక క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డారు. అయినప్పటికి తాను నమ్ముకున్న వృత్తి పట్ల..

టీవీ9 బంగ్లా జర్నలిస్ట్ స్వర్ణేందు దాస్ కన్నుమూత.. సంతాపం తెలిపిన టీవీ9 ఫ్యామిలి..
Swarnendu Das
Follow us on

టివి9 నెట్ వర్క్ లో భాగమైన టివి9బంగ్లాలో రిపోర్టరుగా పనిచేస్తున్న స్వర్ణేందు దాస్ అనారోగ్యం కారణంగా ఈరోజు తుదిశ్వాస విడిచారు. అతడి వయస్సు 35 సంవత్సరాలు.  2014లో అతడు ప్రాణంతాక క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డారు. అయినప్పటికి తాను నమ్ముకున్న వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ.. రిపొర్టర్ అంటే నిర్భయంగా ఉండాలనేదానికి ఉదాహరణగా నిలుస్తూ వచ్చిన సహోద్యోగి స్వర్ణేందు దాస్ మృతిపట్ల టీవీ9 కుటుంబం సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. మృతుడి కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతిని తెలియజేస్తోంది. 2021లో టీవీ9 బంగ్లాలో రిపొర్టుగా చేరిన స్వర్ణేందు దాస్ రైల్వే, రవాణా, జాతీయ రాజకీయాలు, విమానయాన రంగాలకు సంబంధించిన అంశాలపై రిపొర్టింగ్ చేయడంతో పాటు.. అవసరానికి అనుగుణంగా లైవ్ రిపొర్టింగ్ చేస్తూ.. తాజా పరిస్థితులను వీక్షకులకు అందించడంలో స్వర్ణేందు దాస్ ముందువరుసలో ఉండేవారు. ప్రాణంతకమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికి.. విధి నిర్వహణలో అలసిపోకుండా, ఉత్సహంగా, ఉల్లాసంగా ఉండేవారు.

పశ్చిమబెంగాల్ లోని సింగూర్ లోని హుగ్లీలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన స్వర్ణేందు దాస్ చిన్నప్పటికి నుండి కష్టపడేతత్వం గల వ్యక్తి. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ.. ఎటువంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా ధృఢ సంకల్పంతో విధులను నిర్వర్తిస్తూ.. ఎందరో రిపోర్టర్లకు ఆదర్శంగా నిలిచారు. బికాం పూర్తిచేసిన ఆయన ఎన్నో వార్తా సంస్థల్లో పనిచేశాడు. ఎక్కడ పనిచేసినా కష్టపడుతూ.. కొత్త అంశాలను నేర్చుకుంటూ.. పనిలో విసిగిపోకుండా ఎంతో ఉత్సహంతో ఉండే వ్యక్తిని కోల్పోవడం పట్ల టీవీ9 విచారాన్ని వ్యక్తం చేస్తోంది. స్వర్ణేందు దాస్ కు భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. స్వర్ణేందు దాస్ ఇకలేరన్న వార్త తన సహోద్యోగులను కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..