Black Magic: మూడు రోడ్ల కూడలిలో క్షుద్రపూజల కలకలం.. పసుపు-కుంకు, నిమ్మకాయలతో అమ్మాయిల వశీకరణ..!

ఈ ఘటనతో గ్రామస్తులు కూడా రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. ఇదొక్కటే కాదు, గ్రామ రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.

Black Magic: మూడు రోడ్ల కూడలిలో క్షుద్రపూజల కలకలం.. పసుపు-కుంకు, నిమ్మకాయలతో అమ్మాయిల వశీకరణ..!
Black Magic

Updated on: Dec 16, 2022 | 12:31 PM

మాయమాటలు, వశీకరణం, నరబలి, చేతబడి లాంటి ఘటనలు తరచూ కలకలం రేపుతుంటాయి. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో  తీవ్ర సంచలనం రేపుతోంది. యావత్‌ రాష్ట్రాన్నే ఈ వార్త షేక్‌ చేస్తోంది.ఈ సంఘటన షాహూ మహారాజ్ ప్రగతిశీల మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన ప్రభుత్వ పనితీరు, వ్యవస్థలనే ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ప్రస్తుతం కొల్హాపూర్‌లోని పాడలి ఖుర్ద్‌ గ్రామంలోని బాలికలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇక్కడి బాలికల స్కూల్‌ కూడా మూతపడిందని సమాచారం. ఇంతకీ ఎక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా భయంతో వణికిపోతారు.

షాహూ ప్రగతిశీల కొల్హాపూర్‌లో అఘోరాలు, మూఢనమ్మకాలు తెరపైకి వచ్చింది. అమ్మాయిల ఫోటోను ఎదురుగా పెట్టి దానిపై పసుపు కుంకు, నిమ్మకాయలు, విచిత్ర ముగ్గులు వేసి వశీకరణ పూజలు చేస్తున్న షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బలింగ-పడ్లి రోడ్డులో ఈ తరహా చేతబడి జరిగినట్టు గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంత దారుణం చేసింది ఎవరు…? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కానీ, వశీకరం కోసం చేసిన ఈ చేతబడి ఘటనతో ఇప్పుడు పాడలి ఖుర్ద్ గ్రామంలోని బాలికలు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, ఘటన జరిగిన మహారాష్ట్రలోని అదే ప్రాంతంలో కొల్హాపూర్‌కు చెందిన కొందరు ప్రజలు షాక్‌తో రోడ్డెక్కారు. అదే కొల్లాపూర్ నుంచి సామాజిక మార్పు కోసం ఆందోళనలు ప్రారంభించారు. నేడు 21వ శతాబ్దంలో కొల్హాపూర్‌లో జరిగిన వశీకరన్ ఘటన మన మనస్తత్వం ఎటువైపు పోతుందనే ప్రశ్నను రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనతో గ్రామస్తులు కూడా రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. ఇదొక్కటే కాదు, గ్రామ రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి