Kolhapur: రెండు వర్గాల మధ్య చిచ్చురేపిన వాట్సప్‌ స్టేటస్..! కర్ఫ్యూ విధించిన సర్కార్

|

Jun 07, 2023 | 1:50 PM

వాట్సప్ స్టేటస్‌ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో రెండు వర్గాల మధ్య చిచ్చురేపింది. జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా ఓ వర్గానికి చెందిన వారు సోషల్ మీడియా స్టేటస్‌ పెట్టారు. దీనికి నిరసనగా కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంఘాలు బుధవారం (జూన్‌ 7) బంద్‌కు పిలుపు..

Kolhapur: రెండు వర్గాల మధ్య చిచ్చురేపిన వాట్సప్‌ స్టేటస్..! కర్ఫ్యూ విధించిన సర్కార్
Kolhapur Bandh
Follow us on

కొల్హాపూర్: వాట్సప్ స్టేటస్‌ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో రెండు వర్గాల మధ్య చిచ్చురేపింది. జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా ఓ వర్గానికి చెందిన వారు సోషల్ మీడియా స్టేటస్‌ పెట్టారు. దీనికి నిరసనగా కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంఘాలు బుధవారం (జూన్‌ 7) బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో కొల్హాపూర్ నగర వ్యాప్తంగా రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అన్ని దుఖానాలు, మార్కెట్లు మూతపడ్డాయి.

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద వేలాది మంది నిరసనకారులు గుమికూడి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవల్సిందిగా డిమాండ్‌ చేశారు. బంద్​ పిలుపును ఉపసంహరించుకోవాలన్న పోలీసుల సూచనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి మంది మోహరించారు.

400 నుంచి 500 మంది యువకులు ఒక్కసారిగా బిందుచౌక్, గంజి గల్లి ప్రాంతంలో ప్రవేశించి, పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవాణా స్తంభించిపోయింది. ఐదుగురికి మించి ఒకచోట ఉండకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 19 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించారు. పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర పండిట్ నిరసనకారులతో చర్చలు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.