అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..

| Edited By: Team Veegam

Feb 10, 2021 | 1:58 PM

LIC Kanyadan Policy: కరోనా కాలంలో పొదుపు చాలా ముఖ్యం. అమౌంట్ చిన్నదైనా.. పెద్దదైనా.. తప్పకుండా సేవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది...

అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27 లక్షలు పొందొచ్చు.. వివరాలు ఇవే..
Follow us on

LIC Kanyadan Policy: కరోనా కాలంలో పొదుపు చాలా ముఖ్యం. అమౌంట్ చిన్నదైనా.. పెద్దదైనా.. తప్పకుండా సేవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అయితే బీమా చేస్తుంటారు. ఇందుకోసం చాలా స్కీంలు ఉన్నాయి. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ అయితే మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పలు బీమా పాలసీలను అమలులోకి తీసుకొచ్చింది. వాటిల్లో ఓ పాలసీ గురించి ఇప్పుడు చూద్దాం.. దానిలో మీరు తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభం పొందొచ్చు.

ఎల్‌ఐసీ కన్యాధాన్ పాలసీ.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ పాలసీ చేస్తుంటారు. ఉన్నత చదువులు చదివించడం కోసం లేదా వివాహం కోసం డబ్బులు ఆదా చేసుకుంటారు. ఈ పాలసీలో చేరితే మీరు రోజుకు రూ. 120 అంటే నెలకు రూ. 3600 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ(25 సంవత్సరాలు) గడువు పూర్తయ్యేసరికి మీరు రూ. 27 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీకి ప్రీమియం 22 సంవత్సరాలు కడితే చాలు. కాగా, ఈ పాలసీ తీసుకునేవారి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. ఇక సదరు వ్యక్తి కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం నిండాలి. మీ వయస్సు, మీ కుమార్తె వయస్సు ప్రకారం ఈ పాలసీ విధానాలు ఉంటాయి.

ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం. ఇక మొదటి ప్రీమియం కట్టడేటప్పుడు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, చెక్ లేదా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అదనపు ప్రీమియం చెల్లించకుండా అతడి కుటుంబానికి డబ్బు లభిస్తుంది. యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతిలో నామినీకి డెత్ బెనిఫిట్ ఇవ్వబడుతుంది. ఈ పరిస్థితిలో, పాలసీలో మిగిలిన సంవత్సరాల్లో కుమార్తెకు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు.. పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత నామినీకి రూ .27 లక్షలు లభిస్తుంది.

Also Read: వికెట్ తీయలేదు, క్యాచ్ పట్టలేదు.. అనూహ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందాడు.. ఆ బౌలర్ ఎవరంటే.!

లేడీ జడ్జిపై మనసుపడ్డ నేరస్థుడు.. చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు..ఆతర్వాత…

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..