Assam: అసోం లో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతాదళాలు
అసోం లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడ్డాయి. సెర్ఫాంగురి పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్గూరి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మంగళవారం ఉదయం తనిఖీలు...
Assam: అసోం లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడ్డాయి. సెర్ఫాంగురి పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్గూరి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి భద్రతాదళాలకు కనిపించాయి. వెంటనే భద్రతాబలగాలు స్వాదీనం చేసుకున్నాయి.
ఆ ప్రాంతంలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి దొరకడంతో భద్రతా దళాలు భారీ ఎత్తున కుంబింగ్ నిర్వహిస్తున్నామని భద్రతా బలగాలు చెప్పాయి. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక ఏకే-56 రైఫిల్, ఏకే-56 మ్యాగజైన్, 7.65 ఎంఎం ఫ్యాక్టరీ మేడ్ పిస్తోల్, 7.65 ఎంఎం మ్యాగజైన్‌తో పాటు 29 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపాయి.
Also Read: