కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు,, స్వఛ్చందం, టీకామందు తీసుకున్నవారికి బీమా సౌకర్యం లేదన్న కేంద్రం

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరైనా అస్వస్థులు కావడమో, సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కావడమో జరిగితే వారికి బీమా (ఇన్సూరెన్స్) సౌకర్యం లేదని ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది.

కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు,, స్వఛ్చందం, టీకామందు తీసుకున్నవారికి బీమా సౌకర్యం లేదన్న కేంద్రం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2021 | 6:22 PM

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరైనా అస్వస్థులు కావడమో, సైడ్ ఎఫెక్ట్స్ కి గురి కావడమో జరిగితే వారికి బీమా (ఇన్సూరెన్స్) సౌకర్యం లేదని ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఈ విధమైన నిబంధన ఏదీ లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దీనిపై ఇప్పటికీ చాలామందిలో అపోహలున్నాయన్నారు.  స్వల్ప అనారోగ్య లక్షణాలకు ఇన్సూరెన్స్ వెసులుబాటు ఉంటుందా  అని పలువురు సందేహాలను వ్యక్తం చేశారన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు కోవిడ్ సైట్ లో అరగంట సేపు అబ్జర్వేషన్ లో ఉండాలి ఉంటుందని, ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ తో బాధ పడుతున్నట్టు తేలితే వారికి వెంటనే ఉచిత చికిత్స లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనబడితే ఈ కేంద్రాల్లో తక్షణమే చికిత్స చేస్తారని ఆయన అన్నారు. ఈ టీకామందులు తీసుకున్నవారిలో కొందరికి  తలనొప్పి, గిడ్డి నెస్, జ్వరం, యాంగ్జైటీ, రాషెస్ లాంటి స్వల్ప లక్షణాలు కనబడతాయి. అయితే చికిత్స పొందిన వెంటనే వారికీ నయమవుతుంది అని చౌబే వివరించారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో  ఈ నెల 4 వరకు మొత్తం 81 అస్వస్థత కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. టీకామందులపై అసత్య ప్రచారాలను, వదంతులను నమ్మరాదని చౌబే కోరారు.

Read More:Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ

Read More:ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు