Bigg Boss: అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకుంటున్న మోహన్‌లాల్.. బిగ్‌బాస్ సీజన్ 3 కోసం ఏకంగా అన్ని రూ. కోట్లా..?
Mohan Lal Huge Remuneration For Biggboss: ఎక్కడో విదేశాల్లో ప్రారంభమైన ఓ రియాలిటీ షో తెలుగు భాషలోనూ విజయవంతమవడం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ ఒకటి, రెండు, మూడు..

Mohan Lal Huge Remuneration For Biggboss: ఎక్కడో విదేశాల్లో ప్రారంభమైన ఓ రియాలిటీ షో తెలుగు భాషలోనూ విజయవంతమవడం అంత సులభమైన విషయం కాదు. అందులోనూ ఒకటి, రెండు, మూడు.. ఇలా సీజన్‌లు పెరుగుతున్నా కొద్దీ ప్రజాదారణ పెరుగుతుండడం మరీ విశేషం. ఇదంతా బిగ్‌బాస్ రియాలిటీ షో గురించేనని మీకు ఇపాటికే అర్థమై ఉంటుంది కదూ.. అవును భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. ఇక ఈ రియాలిటీ షో ఇంతలా సక్సెస్ కావడానికి బిగ్‌బాస్ హౌజ్‌లో పాల్గొనే కంటెస్టెంట్‌లతో పాటు.. ఈ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వారు కూడా ఓ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తగ్గట్లుగానే బిగ్‌బాస్ యాజమాన్యం కూడా ఆయా భాషల్లో ఉన్న బడా తారలను హోస్ట్‌లుగా నియమించుకుంటోంది. అంతేకాకుండా వీరి స్థాయికి తగ్గట్లుగానే రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. ఇక బిగ్‌బాస్ వ్యాఖ్యాతలు తీసుకునే రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు అడపాదడప టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మలయాళంలో ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మోహన్‌లాల్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఈ నటుడు ఏకంగా రూ.18 కోట్లు తీసుకోనున్నారాని తెలుస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి మలయాళంలో ప్రారంభంకానున్న మూడో సీజన్‌కు మోహన్ లాల్ ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే బిగ్‌బాస్ యాజమాన్యం అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి.
Also Read: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండె పోటుతో రాజీవ్ కపూర్ మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..