AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacqueline Fernandez: ప్రియాంకా ఇంటిని కొనుగోలు చేసిన శ్రీలంక బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..

Jacqueline fernandez Buy Costly House: తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతిథులేం కాదు. కాస్త డబ్బులు సంపాదించుకోగానే ఇంటి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా..

Jacqueline Fernandez: ప్రియాంకా ఇంటిని కొనుగోలు చేసిన శ్రీలంక బ్యూటీ.. ధర ఎంతో తెలిస్తే షాక్‌ కావాల్సిందే..
Narender Vaitla
|

Updated on: Feb 09, 2021 | 5:31 PM

Share

Jacqueline fernandez Buy Costly House: తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతిథులేం కాదు. కాస్త డబ్బులు సంపాదించుకోగానే ఇంటి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా నటీమణులు తమకు అవకాశాలు ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయో అక్కడ ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ తారలు హైదరాబాద్‌లో ఇంటిని కొనుగోలు చేస్తే.. బాలీవుడ్‌ సినీ తారలు ముంబైలో సొంతింటిని ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంకన్‌ బ్యూటీ.. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతోన్న నటి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. దీని ధర ఎంతో తెలుసా..? అక్షరాల రూ.7 కోట్లు. అంతలా ఈ ఫ్లాట్‌లో ఏముందనేగా మీ సందేహం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ బాల్కనీలో నుంచి చూస్తే సముద్రం వ్యూ కనిపిస్తుంది. ఐదు బెడ్‌ రూమ్‌లు, విశాలమైన లివింగ్‌ ఏరియాతో కూడిన ఈ ఫ్లాట్‌లో ఇది వరకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నివసించేది. ప్రియాంక వివాహానికి ముందు ఈ ఇంటిలోనే ఉండేది. నిక్‌ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక అమెరికా వెళ్లే సమయంలో ఈ ఫ్లాట్‌ను అమ్మేసింది. దీంతో ప్రస్తుతం జాక్వలిన్‌ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. ఇక జాక్వలిన్‌ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ.. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌-క్రిష్‌ కాంబినేషనల్ రానున్న సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్‏కు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్ చేసిన మాధురీ..

Follow Us
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?