G-20 Summit Updates: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. G20-2023 సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ ప్రభుత్వం.. దీనిని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. ఈ సదస్సుకు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. G20 సమ్మిట్ సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనుంది. దీనిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అయితే, జీ20 సమావేశాలకు సంబంధించిన ప్రతి క్షణం అప్‌డేట్‌ను ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు.. ఎప్పుడు ఏం ఏం జరుగుతుంది.. ఎవరెవరు పాల్గొంటున్నారు.. ఎలాంటి అంశాలపై చర్చిస్తారు.. దేశాధినేతల ప్రత్యేక సమావేశాలు.. ఇలా G20 అన్ని అప్‌డేట్‌లను తెలుసుకోవాలంటే.. దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన ప్లాట్‌ఫారమ్‌ల గురించి ముందుగా తెలుసుకోవాలి.
ప్రజల సమాచారం కోసం.. మొత్తం 5 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. వీటి సహాయంతో మీరు ఇంట్లో కూర్చుని.. G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రతి క్షణం అధికారిక సమాచారాన్ని పొందగలవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఏమిటి, వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకోండి..
అంతేకాకుండా TV9 Telugu తో కనెక్ట్ అయి ఉండండి. మీరు G20 సమ్మిట్ గురించి సవివరమైన సమాచారాన్ని ప్రతిక్షణం పొందుతూనే ఉండవచ్చు. ఇది మాత్రమే కాదు, ప్రతి క్షణం సమాచారం కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.. G20కి సంబంధించిన వార్తల గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..