AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదంలో మరణించిన మహిళపై అభ్యంతరకర పోస్ట్‌.. కేరళలో ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్!

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ సహా 274 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే విమాన ప్రమాదంలో మరణించిన ఓ నర్సు గురించి ఫేస్​బుక్‌లో అభ్యంతరకర రీతిలో పోస్ట్​చేసిన కేరళకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆయన చేసిన పోస్ట్‌పై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన్న సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేశారు.

విమాన ప్రమాదంలో మరణించిన మహిళపై అభ్యంతరకర పోస్ట్‌.. కేరళలో ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్!
Kerala
Anand T
|

Updated on: Jun 14, 2025 | 10:43 AM

Share

అమ్మాబాద్‌లో జరిగన విమాన ప్రమాదంలో మరణించిన ఓ నర్సు గురించి ఫేస్​బుక్‌లో అభ్యంతరకర పోస్ట్​చేసిన కేరళకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. వివరాళ్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కాసర్​గోడ్ జిల్లాలోని వెల్లరికుండు కార్యాలయంలో ఏ.పవిత్రన్ అనే ఉద్యోగి జూనియర్​సూపరింటెండెంట్​గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయన ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన కేరళకు చెందిన రంజిత అనే నర్సుపై ఫేస్​బుక్‌లో ఓ అభ్యంతరక పోస్ట్‌ చేశారు. అయితే ఈయన పెట్టిన పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అతని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేశారు. ఇదే కాకుండా అతని పోస్ట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి పవిత్రన్ పెట్టిన పోస్ట్‌పై సర్వత్రా విమర్శలు రావడంతో కాసర్‌ గోడ్‌ జిల్లా కలెక్టర్​ఇన్బసేకర్ పవిత్రన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పవిత్రన్‌ చేసిన అభ్యంతకర పోస్ట్‌పై కేరళ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ప్రమాదంలో మరణించిన నర్స్‌ను ఉద్దేశించిన ప్రభుత్వ ఉద్యోగి పవిత్రన్ పెట్టిన పోస్ట్​పై అటూ కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ కూడా రియాక్ట్ అయ్యారు. నర్స్‌ రంజిత పట్ల పవిత్రన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా ఉన్నాయన్నారు. పవిత్రన్‌ పోస్ట్ తన దృష్టికి వచ్చిన వెంటనే అతనిపై సస్పెన్షన్​ఆర్డర్ జారీ చేయడం జరిగిందని కే. రాజన్‌  తెలిపారు.

కాగా కేరళలోని పతనంతిట్ట జిల్లా, పుల్లాడ్ గ్రామానికి చెందిన రంజిత లండన్‌లో నర్స్‌గా పనిచేస్తుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం యూకేలో పనిచేస్తున్న రంజిత కొన్ని రోజుల తర్వాత పూర్తిగా ఇండియాకు వచ్చేసి ఇక్కడే ఉద్యోగం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రక్రియలను పూర్తి చేయడానికి ఇటీవలే ఆమె స్వగ్రామమైన కేరళకు వచ్చింది. ఇక్కడ ఆమె పనులు పూర్తి కావడంతో నాలుగు రోజుల తర్వాత గురువారం తిరిగి లండన్‌కు బయల్దేరింది. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ ప్రమాదానికి గురికావడంతో రంజిత మరణించింది.

అయితే ఈమె మరణం తర్వాత కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రంజిత నివాసానికి వెళ్లారు. అక్కడ రంజిత ఇద్దరు పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. తమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..