AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాక పుట్టిస్తున్న జుంబా వార్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..?

కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. స్కూల్‌ స్టూడెంట్స్‌లో ఒత్తిడిని తగ్గించడానికే ఆటాపాట కార్యక్రమానికి కేరళ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. అయితే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి జుంబా డ్యాన్సులు ఏంటని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. బాలబాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గంతులు వేయడం ఏంటని వాళ్లు అభ్యంతరం చెబుతున్నారు.

కాక పుట్టిస్తున్న జుంబా వార్‌.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..?
Zumba In Schools
Balaraju Goud
|

Updated on: Jun 28, 2025 | 5:54 PM

Share

కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. స్కూల్‌ స్టూడెంట్స్‌లో ఒత్తిడిని తగ్గించడానికే ఆటాపాట కార్యక్రమానికి కేరళ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. అయితే, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి జుంబా డ్యాన్సులు ఏంటని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి, వాళ్లు డ్రగ్స్‌ వైపు మొగ్గు చూపకుండే ఉండేందుకు, కేరళలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జుంబా డ్యాన్స్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది అక్కడి ప్రభుత్వం. బాలబాలికలు మానసికంగా శారీకంగా ఉల్లాసంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కేరళ సర్కార్‌. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బాలబాలికలతో జుంబా డ్యాన్స్‌ చేయిస్తున్నారు టీచర్లు. పిల్లలు కూడా జోరుగా హుషారుగా జుంబా స్టెప్పులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జుంబా డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక విద్యార్థులు మాత్రమే కాకుండా టీచర్లు కూడా జుంబా డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఉల్లాసంగా ఉత్సాహంగా జుంబా డ్యాన్స్‌కి స్టెప్పులు వేస్తున్నారు.

అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన జుంబా డ్యాన్స్‌ శిక్షణపై కొందరు విమర్శలు చేస్తున్నారు. స్కూళ్లలో జుంబా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం…నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ ముస్లిం నేతలు పేర్కొంటున్నారు. బాలబాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గంతులు వేయడం ఏంటని వాళ్లు అభ్యంతరం చెబుతున్నారు.

ముస్లిం సంఘాల నుంచి ఎదురవుతున్న విమర్శలను కేరళ విద్యాశాఖ తిప్పికొడుతోంది. జుంబా డ్యాన్స్‌ అనేది….విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..