Kerala CM: కేరళ సీఎంకు బిగ్ ఝలక్.. విమానంలోనూ వదిలిపెట్టడం లేదు.. షాకింగ్ వీడియో వైరల్..

Kerala CM: కేరళ సీఎం విజయన్‌కు విమాన ప్రయాణంలో షాక్ ఇచ్చారు విపక్ష పార్టీల కార్యకర్తలు. ఏకంగా సీఎంతో పాటు విమానంలో ప్రయాణిస్తూ..

Kerala CM: కేరళ సీఎంకు బిగ్ ఝలక్.. విమానంలోనూ వదిలిపెట్టడం లేదు.. షాకింగ్ వీడియో వైరల్..
Cm Vijayan

Updated on: Jun 14, 2022 | 5:58 AM

Kerala CM: కేరళ సీఎం విజయన్‌కు విమాన ప్రయాణంలో షాక్ ఇచ్చారు విపక్ష పార్టీల కార్యకర్తలు. ఏకంగా సీఎంతో పాటు విమానంలో ప్రయాణిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. గోల్డ్‌ స్కామ్‌ కేసులో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. అధికారిక సమాచారం ప్రకారం.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌కు ఊహించని షాక్‌ ఎదురైంది. ఆయన ప్రయాణం చేస్తున్న విమానంలో నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం విజయన్‌ కన్నూరు నుంచి తిరువనంతపురానికి వస్తున్న విమానంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

విమానంలో ప్రయాణిస్తున్న సీఎం విజయన్‌ సీటు దగ్గరకు నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు రావడంతో ఆయన వెంటే ఉన్న ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ జయరాజన్‌ అప్రమత్తమయ్యారు. వారిద్దరినీ తోసేశారు. ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. నిరసన వ్యక్తం చేసిన వారిని మట్టన్నుర్​బ్లాక్​యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఫర్సిన్‌ మజీద్‌, కన్నూర్​ జిల్లా సెక్రెటరీ ఆర్​కే నవీన్​ కుమార్‌గా గుర్తించారు. వీరిద్దరూ వైద్యం కోసం తిరువనంతంపురం వెళుతున్నామని చెప్పడంతో అధికారులు విమానంలోకి అనుమతించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తిరువనంతపురం విమానాశ్రయం బయట యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. బారికేడ్లను తోసుకొని విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాటర్‌ కెనాన్‌లతో చెదరొట్టారు. ​గోల్డ్‌ స్కామ్‌లో సీఎం విజయన్‌కు ప్రమేయం ఉందని నిందితురాలు స్వప్న సురేష్‌ ఇటీవల ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీలు కొద్ది రోజులుగా విజయన్‌ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి.