కేరళలో ఇద్దరు మహిళల నరబలి కేసును పోలీసులు వేగవంతం చేశారు. ముగ్గురు నిందితులను బుధవారం ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. సంపద కోసం ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ ఘటనపై కేరళ సీఎం విజయన్ సైతం స్పందించారు. దోషులకు కఠినచర్యలు పడేలా చూడాలని పోలీసులను కోరారు. కాగా.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హంతకులు ఓ మహిళను 56 ముక్కలుగా నరికి చంపారని పోలీసులు చెబుతున్నారు. హత్య అనంతరం నిందితులు మృతదేహం మాంసాన్ని కూడా తిన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. భగవాల్ సింగ్, లైలా, షఫీ అకా రషీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తిరువళ్లకు చెందిన భగవత్, పెరుంబవూరుకు చెందిన అతని భార్య లీల, పెరుంబవూరుకు చెందిన షిహాబ్ కూడా నరబలి కేసులో అరెస్ట్ అయ్యారు. ఇద్దరు మహిళలను హత్య చేసిన తరువాత తమ ఇంట్లోనే వాళ్ల శరీరభాగాలను పాతిపెట్టారు. ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది. నిందితులను పోలీసులు విచారిస్తునప్పుడు సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఇద్దరు మహిళలను చంపి వాళ శరీరభాగాలను 56 ముక్కలుగా కోసి.. వండుకొని మరీ తిన్నారని తేలింది. భగవాల్ సింగ్, లైలా శరీర భాగాలను తిన్నట్టు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
తాంత్రికుడి ఆదేశాల మేరకు మిగతా శరీర భాగాలను తమ ఇంట్లో పాతిపెట్టినట్టు కూడా వారు అంగీకరించారు. ఇదంతా డబ్బుకోసమే చేశారని వారు ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు చెప్పారు. అంతేకాదు నీలిచిత్రాల్లో నటిస్తే బాగా డబ్బులు ఇస్తామని చెప్పి ఆ ఇద్దరు మహిళను మంత్రగాడు షపీ ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. ఈ దారుణానికి సూత్రధారిగా షఫీ అని కొచ్చి పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు. బాధితులతో పాటు దంపతులను కూడా అతడు ట్రాప్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. పేద మహిళలను డబ్బు కోసం ప్రలోభాలకు గురి చేసి ట్రాప్ చేయడం షఫీ అలవాటని అన్నారు. నరబలి ఇస్తే సంపద వస్తుందని భగవాల్ సింగ్, లైలా దంపతులను అతడు నమ్మించాడు.
‘Human sacrifice’ in Kerala | Ernakulam District Sessions Court remands the three accused to judicial custody till October 26 https://t.co/WKRGw29LpZ
— ANI (@ANI) October 12, 2022
గోడలపై, నేలపై రక్తం చిమ్మించి..
హత్యకు గురైన మహిళల (పద్మం – రోస్లిన్) మృతదేహాలను అనేక ముక్కలుగా నరికి ఇంటి పెరట్లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. క్షుద్రపూజల్లో భాగంగా గోడలు, నేలపై రక్తం చిమ్మించారని తెలిపారు. కాగా.. మంగళవారం పతనంతిట్టలోని ఎలంతూరు గ్రామంలోని దంపతుల ఇంటి పెరట్లో మృతుల శరీర భాగాలను వెలికితీశారు. మృతుల శరీర భాగాలను ముక్కలుగా కోసి రెండు చోట్ల పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
క్రిమినల్ షఫీ..
నరబలి కేసులో ప్రధాన నిందితుడు షఫీ మామూలు క్రిమినల్ కాదు పెద్ద సైకో అని తెలిపారు. 2020లో కూడా 75 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. చాలా మంది వృద్దులపై అతడు అత్యాచారం చేసినట్టు కేరళ పోలీసులు చెబుతున్నారు. ఏడాది జైలులో ఉన్న తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. 50 ఏళ్లకు పైబడ్డ వృద్దులనే అతడు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా.. ఈ కోణంలోనూ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..