Kerala BJP: కేరళ బీజేపీలో కుదుపు.. సురేంద్రన్ స్థానంలో పార్టీ అధినేతగా సురేష్ గోపి.. కారణం అదేనా..?

|

Sep 23, 2021 | 1:07 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది భారతీయ జనతా పార్టీ. శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఒక్క సీట్ ను కూడా కోల్పోవడం, `మెట్రో మ్యాన్’ శ్రీధరన్ అనూహ్యంగా ఓటమి చెందడం వంటి పరిణామాల పట్ల బిజెపి అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kerala BJP: కేరళ బీజేపీలో కుదుపు.. సురేంద్రన్ స్థానంలో పార్టీ అధినేతగా సురేష్ గోపి.. కారణం అదేనా..?
Kerala Bjp Suresh Gopi
Follow us on

Kerala BJP New President: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది భారతీయ జనతా పార్టీ. శాసనసభ ఎన్నికల్లో ఉన్న ఒక్క సీట్ ను కూడా కోల్పోవడం, `మెట్రో మ్యాన్’ శ్రీధరన్ అనూహ్యంగా ఓటమి చెందడం వంటి పరిణామాల పట్ల బిజెపి అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య సయోధ్య సరిగ్గా లేకపోవడం ఒక కారణంగా భావిస్తున్నారు. పైగా, ఈ మధ్య పలు కేసుల్లో పలువురు బీజేపీ నాయకులను కేరళ పోలీసులు ప్రశ్నిస్తూ ఉండడం, ఎన్నికల ముందు జరిగిన హైవే దోపిడీలో కోల్పోయిన రూ 3.5 కోట్లు బీజేపీ ఎన్నికల నిధిగా కేరళ పోలీసులు ఆరోపణలు చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టతకు భంగం ఏర్పడినట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో కేరళలో పార్టీ ప్రక్షాళనకు అధిష్టానం శ్రీకారం చుట్టింది.

ఆరు నెలలుగా రాష్ట్ర బీజేపీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయన్ వార్తలకు బలం చేకూరుతోంది. సినీ నటులు, పార్లమెంటు సభ్యులు సురేష్ గోపి.. కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు వరకు అధ్యక్షుడిగా ఉన్న సురేంద్రన్ అవినీతి ఆరోపణలు. ఎన్నికల నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అనంతరం పార్టీలో పూర్తి స్థాయిలో కొత్త కార్యవర్గం ఏర్పడనున్నట్లు తెలుస్తో్ంది. సురేష్ గోపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడవుతారని, జాతీయ నాయకత్వం నాయకత్వం ఆదేశాల మేరకు పాల బిషప్ ఇంటికి ఆయన వచ్చినట్లు కూడా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

అయితే, అంతకుముందు.. రాష్ట్ర పార్టీ ప్రక్షాళనపై ఫోకస్ చేసిన కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. స్వతంత్ర వ్యక్తులుగా, నిజాయతీ పరులుగా పేరున్న బీజేపీ సభ్యులైన మాజీ ప్రభుత్వ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రధాని స్వయంగా ఒక రాష్ట్ర బీజేపీ వ్యవహారాలపై ఈ విధమైన కమిటీ వేయడం అసాధారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి సివి ఆనంద బోస్, మాజీ ఐపీఎస్ అధికారి జాకబ్ థామస్, ఇ శ్రీధరన్ సభ్యులుగా గల ఈ కమిటీ పార్టీ నాయకులను, ఎన్నికలలో పోటీ చేసిన వారిని కలిసి ఎన్నికల సందర్భంగా జరిగిన పార్టీ నిధుల పంపిణి గురించి సవివరంగా దర్యాప్తు జరిపింది. ఒక సమగ్రమైన నివేదికను వీరు ప్రధాని, అమిత్ షా లకు అందించారని చెబుతున్నారు. వీరిలో థామస్, శ్రీధరన్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, హవాలా మనీ రాకెట్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను ప్రశ్నించిన సిట్‌ పోలీసులు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కుమారుడు హరిక్రిష్ణన్‌ను ప్రశ్నించించారు. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జి.గిరీష్‌, ప్రధాన కార్యదర్శి ఎం.గణేష్‌ను విచారించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 3న కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు త్రిసూర్‌ సమీపంలోని కొడకర హైవేపై దాదాపు రూ.3.5 కోట్ల మేర డబ్బు దోపిడీకి గురైంది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత 7వ తేదీన షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

అనంతరం దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఏప్రిల్‌ 6వ తేదీన జరగునున్న ఎన్నికలకు సంబంధించి ఓట్లు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును బిజెపి హవాలా మార్గం ద్వారా తరలించే ప్రయత్నం చేశాయని సిపిఎం, కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించారు. వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ కేసు కేరళలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి అప్రతిష్ట తీసుకు వచ్చిన్నట్లు ఆ పార్టీ నాయకులు మండిపడ్దారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రంలో కొత్త కమిటీ ఏర్పడే అవకాశముంది.

Read Also…. Cantonment: కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారు? కారణాలేంటి?