AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.. వారిపై పోక్సో కేసు.. అసలు ఏం జరిగిందంటే..?

9వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. స్కూల్ టాయిలెట్‌లో బాలిక ప్రసవించగా.. తల్లీబిడ్డ సేఫ్‌గా ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, స్టాఫ్ నర్సు, బాధితురాలి సోదరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్టున్నారు.

షాకింగ్.. వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని.. వారిపై పోక్సో కేసు.. అసలు ఏం జరిగిందంటే..?
Student Gives Birth In School
Krishna S
|

Updated on: Aug 29, 2025 | 10:57 AM

Share

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. 10 నెలల క్రితం విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంపై మాట్లాడేందుకు బాలిక నిరాకరించింది. ఈ సంఘటన గురించి కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు శశిధర్ కొసుంబే తెలియజేశారు. కమిషన్ ఈ కేసును తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించింది.

నిర్లక్ష్యంపై ఆగ్రహం

జిల్లా మేజిస్ట్రేట్ హర్షల్ భోయార్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. పాఠశాల సిబ్బంది, వార్డెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులు ఈ కేసులో పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, స్టాఫ్ నర్సు మరియు బాధితురాలి సోదరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని సెక్షన్లను కూడా చేర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పాఠశాలల్లో భద్రత, పర్యవేక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మాకు ఆ డౌటే రాలేదు

ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ బసమ్మ మాట్లాడుతూ, తాను నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. రికార్డుల ప్రకారం ఆ విద్యార్థిని వయస్సు 17 సంవత్సరాల 8 నెలలు అని ఆమె వెల్లడించారు. ఆ బాలిక గర్భం దాల్చిందనే విషయం కానీ, దాని లక్షణాలు కానీ తమకు ఎప్పుడూ కనిపించలేదని ప్రిన్సిపాల్ చెప్పారు. జూన్‌లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి ఆ విద్యార్థిని తరచుగా గైర్హాజరయ్యేదని, ఆగస్టు 5 నుంచి మాత్రమే క్రమం తప్పకుండా హాజరవడం మొదలుపెట్టిందని ఆమె వివరించారు. అయితే, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందనే విషయం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా వారు నిరాకరించారని ఆమె చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..