
locals boycotted Anganwadi centre: స్వతంత్ర భారతంలో నివురుగప్పిన నిప్పులా ఇంకా కుల, మత వివక్ష సజీవంగానే ఉందనడానికి సజీవ సాక్ష్యం ఈ సంఘటన. ఓ దళిత మహిను హెల్పర్‌గా నియమించినందుకు గ్రామస్థులంతా కలిసి గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని బహిష్కరించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటక (Karnataka)లోని బీదర్ జిల్లాలోని హత్యాల గ్రామంలోనున్న ఆంగన్‌వాడీ కేంద్రానికి హెల్పర్‌గా మిలానా బాయి జైపా రాణే అనే మహిళను 2021 జూన్‌లో కేంద్రం నియమించింది. కోవిడ్-19 కారణంగా కొంతకాలం అంగన్‌వాడీ కేంద్రం మూతపడినప్పటికీ గత కొన్ని నెలలుగా తిరిగి తెరుకుంది. ఐతే పిల్లలెవ్వరూ అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆరా తియ్యగా.. సదరు గ్రామంలోని ప్రజలందరూ అగ్రవర్ణాలకు చెందిన వారని, అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్‌గా పనిచేస్తున్న మహిళ దళిత (Caste discrimination) కులానికి చెందినదని, ఒక దళిత మహిళ తమ పిల్లలను తాకనివ్వబోమని ముక్త కంఠంతో చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఐతే తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని అంగన్‌వాడీ కేంద్రానికి పంపేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.