AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 ఏళ్ల బాలిక కిడ్నాప్, ఆపై అత్యాచారం.. కట్ చేస్తే.. రామలింగ మఠాధిపతి అరెస్ట్!

కర్ణాటకలోని బెల్గాంలో ఒక మఠం అధిపతిని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదే పదే అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం(మే 24) సమాచారం ఇచ్చారు. బెల్గాం జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకాలోని మేకాలి గ్రామంలోని రామమందిర మఠానికి చెందిన నిందితుడు హఠ యోగి లోకేశ్వర్ స్వామి (30)ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల బాలిక కిడ్నాప్, ఆపై అత్యాచారం.. కట్ చేస్తే.. రామలింగ మఠాధిపతి అరెస్ట్!
Arrest
Balaraju Goud
|

Updated on: May 25, 2025 | 11:46 AM

Share

కర్ణాటకలోని బెల్గాంలో ఒక మఠం అధిపతిని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పదే పదే అఘాయిత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు పోలీసులు శనివారం(మే 24) సమాచారం ఇచ్చారు. బెల్గాం జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకాలోని మేకాలి గ్రామంలోని రామమందిర మఠానికి చెందిన నిందితుడు హఠ యోగి లోకేశ్వర్ స్వామి (30)ను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితురాలు, కుటుంబసభ్యులతో కలిసి స్వామి వద్దకు వెళ్లింది. వైద్యంతో నయం చేస్తాడని నమ్మి వెళ్లింది. కొంతమంది బంధువులు సూచించిన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మఠానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో మే 13న ఈ నేరం జరిగిందని ఆరోపించింది. గ్రామంలోని తన బంధువుల ఇంటి నుండి తన ఇంటికి వెళుతుండగా, నిందితుడు తనకు లిఫ్ట్ ఇచ్చాడని బాధితురాలు తెలిపింది. తాను డ్రాప్ చేస్తానంటూ కారు ఎక్కించుకుని బాలికను కిడ్నాప్ చేశాడు. మే 13 నుంచి మే 15 వరకు రాయచూర్, బాగల్‌కోట్‌లోని లాడ్జీలలో లోకేశ్వర స్వామి తనను తీసుకెళ్లి, పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.

రాయచూర్ లాడ్జిలో ఉంచి రెండు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాగల్కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. దారుణానికి ఒడిగట్టిన తర్వాత, అతను తనను మహాలింగ్‌పుర బస్ స్టాండ్ వద్ద వదిలి వెళ్లాడు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధితురాలు తన తండ్రికి చెప్పినప్పుడు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. దీని తరువాత, ఆమె తండ్రి సూచన మేరకు ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత విభాగాల కింద స్వామిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం(మే 22) నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
5 రోజుల ఉపవాస దీక్షలో సంచలన నిజాలు
5 రోజుల ఉపవాస దీక్షలో సంచలన నిజాలు