కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు కఠిన ఆంక్షలను విధించేందుకు సిద్దమైంది. ఈ నేపధ్యంలో ఒమిక్రాన్ వైరస్‌పై ఇటీవల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఇలా ఉన్నాయి..
1. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి.
2. తల్లిదండ్రులు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేవరకు విద్యార్ధులు ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరు కాకూడదు.
3. అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు 2022 జనవరి 15వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ పాఠశాలలు, యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ.
4. విదేశాల నుంచి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు తప్పనిసరి. రిపోర్ట్స్ వచ్చేవరకు ఎయిర్ పోర్టులలోనే ఉండాలి.
కాగా, ఇప్పటికే బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి కాంటాక్ట్ అయిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అది ఒమిక్రానా.? కాదా.? అనేది తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను జీనోమ్ స్వీక్వెనింగ్ ల్యాబ్‌కు పంపించారు.
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!