Karnataka elections 2023: క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక ఎన్నికల ప్రచారం.. పేలుతున్న మాటల తూటాలు..!

| Edited By: Ravi Kiran

May 07, 2023 | 4:26 PM

కర్నాటక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ , కాంగ్రెస్‌ తరపున సోనియాగాంధీ తొలిసారి ప్రచారం చేశారు. ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు నేతలు.

కర్నాటక ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రచారానికి 48 గంటలు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు దూకుడను పెంచాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తన పాత అలవాట్లను వదిలేయదంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. ఒక వర్గాన్ని తృప్తిపరిచే చర్యలు, ఓటుబ్యాంక్‌ రాజకీయాలు చేస్తుందని బాదామిలో విమర్శించారు. అలాగే బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను మూసేస్తారనీ, లింగాయత్‌లను OBC వర్గాలను తిట్టిపోస్తారనివ వార్నింగ్‌ ఇచ్చారు.

బెంగళూరులో మోదీ మెగా రోడ్‌ షో నిర్వహించారు. 26 కిలో మీటర్లు మేర నిర్వహించిన ర్యాలీలో.. 17 నియోజకవర్గాలను కవర్‌ చేశారు. ప్రధాని మోదీ మెగా రోడ్‌ షోతో బెంగళూరు సిటీ కాషాయ మయమైంది. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ జెండాలతో జనం స్వాగతం పలికారు. అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. హవేరి , బాదామిలో సభలకు హాజరయ్యారు మోదీ.

సోనియాగాంధీ , రాహుల్‌, ప్రియాంక ప్రచారం

కాంగ్రెస్‌ తరపున ఒకేరోజు సోనియాగాంధీ , రాహుల్‌, ప్రియాంక ప్రచారం చేశారు. తొలిసారి కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సోనియాగాంధీ. హుబ్లీలో జగదీశ్‌ శెట్టార్‌ తరపున ప్రచారం చేశారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రతో బీజేపీలో భయం ప్రారంభమయ్యిందన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పడం లేదన్నారు సోనియా.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కొత్త నినాదం

కర్నాటకలో బీజేపీ బజరంగ్‌బలి నినాదానికి పోటీగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. జై బజరంగ్‌బలి తో బ్రష్టాచార్‌కీ నళీ అనే నినాదాన్ని ఇచ్చారు ఖర్గే..

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..