Karnataka CM: కర్ణాటక సీఎంగా ఆయనకే ఛాన్స్? అధికారికంగా ప్రకటించే అవకాశం?
కర్ణాటక సీఎం పదవిపై హైడ్రామా కొనసాగుతోంది. ఢిల్లీకి చేరిన రాష్ట్ర రాజకీయంపై తీవ్ర ఉత్కంట నెలకొంది. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్‌లు నువ్వా.. నేనా అన్నట్లు సీఎం కుర్చి కోసం పోటాపోటీగా ఉన్నారు. అయితే ఈ ఉఠ్కంటను తెరదించేందుకు ఖర్గే నివాసంలో కేసీ..
కర్ణాటక సీఎం పదవిపై హైడ్రామా కొనసాగుతోంది. ఢిల్లీకి చేరిన రాష్ట్ర రాజకీయంపై తీవ్ర ఉత్కంట నెలకొంది. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్‌లు నువ్వా.. నేనా అన్నట్లు సీఎం కుర్చి కోసం పోటాపోటీగా ఉన్నారు. అయితే ఈ ఉఠ్కంటను తెరదించేందుకు ఖర్గే నివాసంలో కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు సమావేశం అయ్యారు. ఈ వ్యవహారం నేపథ్యంలో సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, డీకే శివకుమార్ బెంగళూరులోనే ఉన్నారు. తనకు ఆనారోగ్య కారణంగా ఢిల్లీకి వెళ్లడం లేదని ప్రకటించారు. ఇక కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుని సీఎం పదవి అభ్యర్థిపై చర్చిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం పదవి సిద్దరామయ్యకే ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్యకే సీఎం పదవి కట్టబెడితే మరి డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, బెంగళూరులోని సదాశివనగర్‌లో తన నివాసంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. నాకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలేనని అన్నారు. నాకు సమయస్ఫూర్తి, పోరాట పటిమ ఉంది. పోరాటంలో విజయం సాధించాలంటే ఓపిక పట్టాలి. ధర్మ రాయల లాగా ఓపిక పట్టాలి. సీఎం పదవి గురించి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి