Karnataka CM: కౌన్ బనేగా కర్ణాటక సీఎం.. ‘ఇంకా ఫైనల్ కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్’..

|

May 17, 2023 | 3:58 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది.. కానీ.. సీఎం ఎవరన్నది మాత్రం నాలుగు రోజుల నుంచి ఒకటే ఉత్కంఠ.. అదిగో సీఎం పేరు ఖరారు.. ఇదిగో ఆయనే ఫైనల్ ఇలా గంటగంటకో వార్త.. వెలువడుతోంది.

Karnataka CM: కౌన్ బనేగా కర్ణాటక సీఎం.. ‘ఇంకా ఫైనల్ కాలేదు.. చర్చలు జరుగుతున్నాయ్’..
Karnataka Cm Post
Follow us on

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది.. కానీ.. సీఎం ఎవరన్నది మాత్రం నాలుగు రోజుల నుంచి ఒకటే ఉత్కంఠ.. అదిగో సీఎం పేరు ఖరారు.. ఇదిగో ఆయనే ఫైనల్ ఇలా గంటగంటకో వార్త.. వెలువడుతోంది. ఉదయం నుంచి కర్నాటక సీఎంగా సిద్దరామయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరికాసేపట్లో సిద్ధరామయ్య పేరును ఖరారు చేస్తారంటూ ప్రచారం జరిగింది. డీకే శివకుమార్.. సిద్ధరామయ్యతో చర్చలు జరిపిన హైకమాండ్.. ఎమ్మెల్యేల మద్దతు, పరిస్థితులకనుగుణంగా సిద్ధరామయ్య పేరును ఫైనల్ చేసినట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. మరికాసేపట్లో సీఎం పేరు ప్రకటన ఉంటుందన్న ఉత్కంఠలో కాంగ్రెస్ కీలక నేత రణదీప్ సూర్జేవాలా మరో ప్రకటన చేశారు.

కర్ణాటక సీఎం ఎవరన్నది ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదని.. ఇవాళ లేదా రేపు నిర్ణయం ప్రకటిస్తామని రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అధికారిక ప్రకటన చేస్తారన్నారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం వస్తున్నవన్నీ ఊహాగానాలే.. 72 గంటల్లో కొత్త కేబినెట్‌ కొలువు దీరుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీల అమలు అమలు చేస్తామని.. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ సూర్జేవాలా తెలిపారు. కర్నాటకలో 5 ఏళ్లపాటు సుస్థిర ప్రభుత్వం ఉంటుందని స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయవార్తల కోసం