MLA Arrest: అవినీతి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు..

|

Mar 28, 2023 | 6:00 AM

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్‌ షాక్. అవినీతి కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపక్షప్ప అరెస్ట్‌ అయ్యారు. 8 కోట్ల ముడుపుల కేసులో ఆయన్ని అరెస్టు చేశారు.కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. ఆయన బెయిల్ రద్దు అయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించి

MLA Arrest: అవినీతి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు..
Karnataka Birbery Case
Follow us on

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్‌ షాక్. అవినీతి కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపక్షప్ప అరెస్ట్‌ అయ్యారు. 8 కోట్ల ముడుపుల కేసులో ఆయన్ని అరెస్టు చేశారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. ఆయన బెయిల్ రద్దు అయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించి ఓ అవినీతి కేసులో విరూపాక్షప్ప ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కాంట్రాక్టు అప్పగించడానికి 40 లక్షలు రూపాయలు లంచం తీసుకుంటుండగా బీజేపీ ఎమ్మెల్యే మాడాల్ విరుపాక్షప్ప కుమారుడు, ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంత్ మాడాల్‌ గత నెలలో రెండ్‌ హ్యాండెట్‌గా పట్టుబడ్డారు. ఆ లంచం కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు రా మెటీరియల్ సప్లై చేసే టెండర్ పొందడానికి ఈ లంచం ఇచ్చినట్టు లోకాయుక్తా పోలీసులు తెలిపారు. ఈ అవినీతి కేసును లోకాయుక్తా పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంత్ మదల్‌ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తర్వాత పోలీసులు వారి ఇంటిలో తనిఖీలు చేశారు. ఈ రైడ్‌లో లెక్కకు రాని 8 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం సుపారీలు అమ్మడం ద్వారా వచ్చాయని చిన్నగిరి ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప వాదించారు. ఈ అవినీతి కేసు బయటకు రాగానే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌ చైర్మన్ పోస్టు నుంచి వైదొలిగారు. ఈ నెలలో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ లభించగానే దేవాంగిరిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయితే, ఈ బెయిల్‌ను అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ బెయిల్ రద్దు కావడంతో అతడిని వెంటనే అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..