AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర గవర్నర్ తో కంగనా రనౌత్ భేటీ

మహారాష్ట్రలో శివసేన నేతలతో రాజకీయ వివాదం తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్  ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్  కోష్యారీతో భేటీ అయింది. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ వివరాలు..

మహారాష్ట్ర గవర్నర్ తో కంగనా రనౌత్ భేటీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 13, 2020 | 5:52 PM

Share

మహారాష్ట్రలో శివసేన నేతలతో రాజకీయ వివాదం తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్  ఆదివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్  కోష్యారీతో భేటీ అయింది. రాజ్ భవన్ లో జరిగిన ఈ భేటీ వివరాలు తెలియలేదు. అయితే ముంబైలో తన ఆఫీసును మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం, శివసేన నేత సంజయ్ రౌత్ కి తనకు మధ్య తలెత్తిన గొడవను, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తనను ముంబైలో అడుగు పెట్టనివ్వబోమంటూ చేసిన హెచ్ఛరికలను కంగనా ఈ సమావేశంలో గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. కాగా ఈమెకు చెందిన కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేయడంపై గవర్నర్  కోష్యారీ …..సీఎం ఉధ్ధవ్ థాక్రే పొలిటికల్ అడ్వైజర్ ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అటు-కంగనా రాజ్ భవన్ కి వెళ్తుండగా ఆమె నివాసం వద్ద ఆలిండియా పాంథర్ సేన నిరసన ప్రదర్శన నిర్వహించింది. దళిత సంస్థ అయిన ఈ విభాగం ఇటీవల కంగనా చేసిన ట్వీట్లకు ప్రొటెస్ట్ చేసింది.