K. Keshava Rao: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే దేశానికి గర్వకారణం: ఎంపీ కె.కేశవరావు
K. Keshava Rao: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, నీటిపారుదల, విద్యుత్
K. Keshava Rao: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే గర్వకారణమని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, నీటిపారుదల, విద్యుత్ రంగాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిన్న అఖిలపక్ష భేటీ అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని, పార్టీమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనేది టీఆర్‌ఎస్ విధానం కాదని కేకే స్పష్టం చేశారు. ఏం చేసినా తెలంగాణ ప్రయోజనాలకేనని, రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా నిలిచే పనులను టీఆర్‌ఎస్ ఎప్పటికీ చేయదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎ వరితోనైనా స్నేహం చేసేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు.