BJP-TDP Alliance: పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి.. అభినందించిన బీజేపీ చీఫ్‌ నడ్డా..

|

Mar 14, 2023 | 9:14 PM

అండమాన్‌ నికోబార్‌ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.

BJP-TDP Alliance: పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి.. అభినందించిన బీజేపీ చీఫ్‌ నడ్డా..
Bjp Tdp Alliance
Follow us on

అండమాన్‌ నికోబార్‌ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. పోర్ట్ బ్లెయిర్ ప్రజల కోసం మీ కృషి.. అంకితభావం ఫలించాయని.. ఈ విజయం ప్రధానిపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమంటూ జేపీ నడ్డా కొనియాడారు. కాగా.. గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలను దక్కించుకుంది. గెలిచింది 2 స్థానాలే అయినా, పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా మారింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు రాగా.. కాంగ్రెస్ కూటమి 11 స్థానాలు గెలిచింది. దీంతో టీడీపీ మద్దతుతో బీజేపీ కౌన్సిల్ పీఠాన్ని అధిష్ఠించింది.

అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళా నేత సెల్వి 5వ వార్డు నుంచి గెలవగా, హమీద్ 1వ వార్డు నుంచి గెలిచారు. అయితే, అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి చేపట్టారు. ఇప్పుడు రెండో టర్మ్‌లో టీడీపీకి అవకాశం వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం