Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా.. అమిత్‌షాకు కీలక ఆదేశాలు..
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. అమిత్‌షాను పహల్‌గామ్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చింది..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు చనిపోగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకుని.. కూంబింగ్ నిర్వహిస్తున్నాయి..
అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్..
ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్‌షాను పహల్‌గామ్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చింది..
PM Modi had a telephonic conversation with Union Home Minister Amit Shah on the Pahalgam terror attack and asked him to take all suitable measures. PM also asked the Union Home Minister to visit the site. pic.twitter.com/K3g2b9aa5w
— ANI (@ANI) April 22, 2025
ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం..
పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడిన నేరస్థులు.. క్రూరులు.. అంటూ పేర్కొన్నారు. ఖండించడానికి కూడా మాటలు సరిపోవంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
#WATCH | J&K | Tourists injured in the Pahalgam terrorist attack have been moved to the local hospital here
Visuals from outside the hospital in Pahalgam pic.twitter.com/aHlyg0Xyfy
— ANI (@ANI) April 22, 2025
కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్‌గామ్‌లో అమర్‌నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఓ మహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది,.
#WATCH | Terrorists attack tourists in Pahalgam | Former Pahalgam MLA and General Secretary of J&K Apni Party Rafi Ahmad Mir says, “This is very unfortunate. We thought the government had achieved zero tolerance against terrorism. We hope the government reaches the bottom of it… pic.twitter.com/LISzXsQdTs
— ANI (@ANI) April 22, 2025
జమ్ముకశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు.. పహల్‌గామ్ కూడా అందులో ఒకటి.. ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలివస్తుంటారు.. మార్చిలో భారీగా మంచు కురియడంతో ఆ ప్రాంతానికి భారీగా టూరిస్టులు తరలివచ్చారు. ట్రెక్కింగ్ వెళ్లిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ దాడి వెనుక లష్కర్ ఉగ్రవాదుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు.
బైసరీన్ వ్యాలీని చూసేందుకు వచ్చిన వాళ్లను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఏడుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , తమిళనాడు, ఒడిశాకు చెందిన పర్యాటకులకు గాయాలయ్యాయి.
ఐబీ అధికారి మనీష్ రంజన్ మృతి..
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..