JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ విడుదల.. ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ.. పూర్తి వివరాలివే..

జేఈఈ మెయిన్స్-2021 షెడ్యూల్ పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 22 నుంచి 25 వరకు ఆన్‏లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ విడుదల.. ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ.. పూర్తి వివరాలివే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 16, 2020 | 6:40 PM

జేఈఈ మెయిన్స్-2021 షెడ్యూల్ పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 22 నుంచి 25 వరకు ఆన్‏లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో జేఈఈ వెబ్‏సైట్ నుంచి ఆ బ్రోచర్‏ను తొలగించింది. అందులో కొన్ని మార్పులు చేసి బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరిగి కొత్త నోటిఫికేషన్‏ను విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత వచ్చే మూడు సెషన్లను మార్చి, ఏప్రిల్, మేలలో జరపనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది.