ఉగ్రవాదుల ఘాతుకం…….జమ్మూ కాశ్మీర్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దంపతుల కాల్చివేత ! కుమార్తె కూడా మృతి ?

| Edited By: Anil kumar poka

Jun 28, 2021 | 12:58 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్ ను, ఆయన భార్య రోజా బేగం ని కాల్చి చంపారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరి ఇంటిలోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఉగ్రవాదుల ఘాతుకం.......జమ్మూ కాశ్మీర్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దంపతుల కాల్చివేత ! కుమార్తె కూడా మృతి ?
Jammu Kashmir Special Police Officer
Follow us on

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్ ను, ఆయన భార్య రోజా బేగం ని కాల్చి చంపారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరి ఇంటిలోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వీరితో బాటు వీరి కుమార్తె కూడా గాయపడింది. వీరిని ఆసుపత్రికి తరలించగా ఫయాజ్ అహ్మద్ దంపతులు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. వీరి కుమార్తె చికిత్స పొందుతూ మరణించినట్టు తాజా సమాచారం.. అవంతీపుర లోని హరిపరిగాం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఫయాజ్ అహ్మద్ కొన్నేళ్ల క్రితం ఇక్కడ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేబట్టారు. అయితే రాజీనామా చేయవలసిందిగా ఆయనకు రెండేళ్ల క్రితం బెదిరింపు కాల్ అందినట్టు తెలిసింది. కానీ అందుకు ఆయన తిరస్కరించారు. బహుశా ఈ కారణం వల్లే ఉగ్రవాదులు ఆయన కుటుంబంపై కాల్పులు జరిపివుంటారని భావిస్తున్నారు, ఫయాజ్ అహ్మద్ కుమారుడు టెరిటోరియల్ ఆర్మీలో జవానుగా పని చేస్తున్నారు.

ఫయాజ్ అహ్మద్ దంపతుల కాల్చివేత ఘటనతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భదతా బలగాలను మోహరించారు. అక్కడ ఎవరినీ అనుమతించకుండా కార్దన్ ఆఫ్ చేశారు. జమ్మూ లోని భారత మిలిటరీ స్థావరంపై టెర్రరిస్టులు డ్రోన్ తో దాడి జరిపిన రోజే ఈ ఘటన జరిగింది. ఆ దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ ఈ డ్రోన్ ఎటాక్ కి పాల్పడిందని సైనికాధికారులు తెలిపారు. టెర్రరిస్టుల ఏరివేతకు జమ్మూ కాశ్మీర్ లోని పలు కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ వారు ఏదో విధంగా చొరబడుతూనే ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: విల్లును విరిచి వధువు మనుసు గెలుచుకున్న వరుడు..అచ్చం రామాయణం సీన్ రిపీట్ వైరల్ అవుతున్న వీడియో :Viral video.

కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video

గంటలో 4 వేల రోటీలు చేసే రోటి మేకర్ ను ఎప్పుడైనా చూసారా..?నెట్టింట్లో దూసుకపోతున్న వీడియో :Roti Making video.

బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.