Jammu Kashmir Earthquake: మంచుకొండల్లో అలజడి.. జమ్మూ కాశ్మీర్‌లో 3.6 తీవ్రతతో కంపించిన భూమి..

|

Feb 17, 2023 | 7:30 AM

టర్కియా, సిరియాలో సంభవించిన భూకంపం పెను విధ్వాంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా భారత్‌లోనూ భూకంపం సంభవించింది.

Jammu Kashmir Earthquake: మంచుకొండల్లో అలజడి.. జమ్మూ కాశ్మీర్‌లో  3.6 తీవ్రతతో కంపించిన భూమి..
Earthquake
Follow us on

భూకంపం.. ఈ పేరు వింటేనే జనం భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే టర్కియా, సిరియాలో సంభవించిన భూకంపం పెను విధ్వాంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా భారత్‌లోనూ భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం ఉదయం 5:01 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాకు తూర్పున 97 కిలోమీటర్ల దూరంలో భూకంపం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 5.15 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, అంతకుముందు రోజు కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. ఉదయం 9.26 గంటలకు భూకంపం సంభవించగా, దాని తీవ్రత 3.9గా నమోదైంది. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి..