శీతాకాలం జమ్మూ కశ్మీర్‌తో పాటు లడఖ్ సహా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోతున్నాయి. జమ్మూ, కశ్మీర్ వాతావరణ విభాగం ప్రకారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 9 డిగ్రీలకు చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో నీరు గడ్డ కట్టింది. పైపుల్లో నీరు పేరుకుపోయింది.
కశ్మీర్‌లో చలికాలం పెరుగుతోంది. రానున్న 10 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉంటుంది. రానున్న రోజుల్లో చలి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. లోయలో కురుస్తున్న మంచును చూసి పర్యాటకులు ఆనందిస్తున్నారు.
గుల్‌మార్గ్, పహల్‌గామ్, సోనామార్గ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఈ ప్రదేశాలలో పర్యాటకులు మంచును ఆస్వాదిస్తున్నారు. గుల్‌మార్గ్‌లో కురిసే మంచు వర్షంతో అక్కడ రెండు అంగుళాలు మేర మంచు పేరుకుంది. కొంగ్డోరిలో అనేక అంగుళాల మందపాటి మంచు ఉంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.
హిమపాతం కారణంగా లడఖ్‌ను జమ్మూ కాశ్మీర్‌ను కలిపే రహదారులను మూసివేశారు. మొఘల్ రోడ్డు, సింథాన్ రోడ్లు కూడా వాహనాల రాకపోకలను మూసివేశారు. రోడ్లను శుభ్రం చేసేందుకు పోలీసులు యంత్రాలను, కార్మికులను మోహరించారు.
డిసెంబరు 12 నుంచి 13 మధ్య మళ్లీ భారీ మంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలు కిటకిటలాడుతున్నాయి. అంతేకాదు కురుస్తున్న హిమపాతాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులతో అక్కడ పర్యాటక రంగంలో ఆనందం నెలకొంది. చలికాలం పర్యాటక రంగానికి మంచి ఉత్సాహాన్ని తీసుకుని వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..