AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone: సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన పోలీసులు.. అందులోంచి ఐదు కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

Drone: దేశ రాజధాని ఢిల్లీలో దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు..

Drone: సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన పోలీసులు.. అందులోంచి ఐదు కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
Subhash Goud
|

Updated on: Jul 23, 2021 | 8:41 AM

Share

Drone: దేశ రాజధాని ఢిల్లీలో దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇతే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి ఢిల్లీపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాల నుంచి అందిన సమాచారంతో భద్రతా బలగాలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను పోలీసులు కూల్చివేశారు. డ్రోన్‌ నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌ నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ డ్రోన్‌లో 5 కిలోల బరువున్న అధునాతన పేలుడు పదార్థాలను గుర్తించారు. డ్రోన్‌ కార్యకలాపాల వెనుకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు భద్రతా బలగాలు. అయితే జమ్మూ లేదా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో డ్రోన్‌ కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఓ డ్రోన్‌ గుర్తించారు. డోన్‌లతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ తన సిబ్బందికి జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బార్‌సింగ్‌ సూచించారు.

కాగా, భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశంపై దిల్లీ పోలీసులను సైతం అప్రమత్తం చేశాయి.

ఇవీ కూడా చదవండి

Heavy Rains: భారీ వర్షాలకు అతలాకుతలం.. విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకున్న 300 మంది.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

Senior Citizens: వృద్ధులకు అండగా కేంద్ర కొత్త చట్టాలు.. ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. బిల్లులో ఎముందంటే..?

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్