స్వాతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. లోయలోనే కాకుండా.. నదీ పరివాహక ప్రాంతాల గుండా కూడా ఉగ్రవాదులు చొరబడేయత్నం చేస్తుండగా వారికి చెక్ పెట్టేందుకు నదీ పరివాహక ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. తాజాగా.. చెనాబ్ నదిలో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ నిర్వహించింది. లేటెస్ట్ టెక్నాలజీ కల్గిన పడవల్లో ఈ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్లు.. 24 గంటల పాటు.. చెనాబ్ నదిలో తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. మరోవైపు లోయలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ఉగ్ర స్థావరాలను గుర్తించిన సైన్యం.. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Read More :
రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్ కేసులు