తొలిసారిగా ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు.. దరఖాస్తులకు ఆహ్వానం

|

Jun 19, 2020 | 2:54 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఉచితంగా ఒక కోర్సును నిర్వహించనున్నది. ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వారం రోజులపాటు ఆన్‌లైన్‌లో జరుగనున్న ఈ ఉచిత కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది.

తొలిసారిగా ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు.. దరఖాస్తులకు ఆహ్వానం
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఉచితంగా ఒక కోర్సును నిర్వహించనున్నది. సంస్థకు చెందిన శిక్షణ, విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్‌) ద్వారా ‘శాటిలైట్‌ ఫోటోగ్రామెట్రీ పై సర్టిఫికెట్‌ కోర్సును అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రొఫెసర్లు, ఎన్జీవోలు, విద్యార్థులు, విపత్తి నిర్వాహణకు చెందిన పరిశోధకులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇస్రో పేర్కొంది. ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వారం రోజులపాటు ఆన్‌లైన్‌లో జరుగనున్న ఈ ఉచిత కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే అభ్యర్థులు వారి యూనివర్సిటీలు లేదా సంస్థల తరుఫున విధిగా స్పాన్సర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోటోగ్రామెట్రిక్ కాన్సెప్ట్స్, బేసిక్స్ ఆఫ్ జీపీఎస్‌, శాటిలైట్ ఫోటోగ్రామెట్రీ, డీఈఎం, ఆర్థోఇమేజ్ జనరేషన్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అయితే 70 శాతం హాజరు కలిగి అసైన్‌మెంట్స్‌ను పూర్తి చేసిన ప్రొఫెషనల్స్‌కు, 70 శాతం హాజరు కలిగి, ఆన్‌లైన్‌ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు మాత్రమే సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ఉచిత కోర్సునకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇస్రో, ఐఐఆర్‌ఎస్‌ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చునని ఇస్రో వెల్లడించింది.