
ఎక్కువగా రైలులో ప్రయాణించే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ప్రయాణించే రైలు ఛార్జీని ఎలా లెక్కిస్తారో తెలుసా? వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీరు చూస్తున్న ఛార్జీ దేని ఆధారంగా లెక్కించబడుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఏ ప్రాతిపదికన ట్రైన్ టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దేశాన్ని ఒక మూల నుంచి మరో మూలకు కలిపే ఏకైక ప్రయాణ సాధనం రైలు మార్గం. దీని ప్రయాణం ఇతర మార్గాల కంటే చాలా చౌకగా ఉంటుంది. అయితే, ఏ ప్రయాణం అయినా ఛార్జీలు చెల్లించాల్సిందే. ట్రైన్ ట్రావెలింగ్‌కు కూడా ఛార్జీలు ఉంటాయి. అయితే, ట్రైన్ టైప్‌ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. శతాబ్ది రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. ఇక రాజధాని, ఎక్స్‌ప్రెస్, ఇతర రైళ్లకు వేర్వేరు ఛార్జీలు ఉన్నాయి. ఇక వీటిలో దూరాన్ని బట్టి ఛార్జీలు, రిజర్వేషన్ ఛార్జీ, GST, అనేక ఇతర అంశాల ఆధారంగా రైలు టిక్కెట్ ఛార్జీలు నిర్ణయించడం జరుగుతుంది.
రైలు ఛార్జీల గణనలో కిలోమీటర్ అతిపెద్ద అంశం. అంటే, మీరు ప్రయాణించాల్సిన దూరం అతిపెద్ద అంశం. రైలు ఛార్జీల దూరం అనేక వర్గాలుగా విభజించడం జరిగింది. 1 5, 6 10, 11 15, 16 20, 21 25, 4,951 5,000 కిలోమీటర్ల కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇలా ప్రయాణించే దూరాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయించబడతాయి.
రైలు ఛార్జీల పూర్తి వివరాలు భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. కావాలంటే, అక్కడ నుండి ఛార్జీల వివరాలను పరిశీలించొచ్చు. ఇందుకోసం, భారతీయ రైల్వే వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత.. రైల్వే బోర్డు విభాగంపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు కోచింగ్ విభాగంలో ఛార్జీల గురించి సమాచారం వస్తుంది.
బస్సు, టాక్సీ, ఇతర పబ్లిక్ ట్రావెలింగ్ ఛార్జీలతో పోలిస్తే.. రైలులో ప్రయాణించడం చాలా చౌకగా మారుతుంది. ఇందులో టోల్, పెట్రోల్ పేరుతో ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. మీరు లక్నో నుండి ఢిల్లీకి క్యాబ్‌లో వస్తున్నారనుకోండి.. అప్పుడు మీరు కనీసం రూ. 8 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రైన్‌లో కేవలం 6 గంటల్లోనే, అది కూడా రూ.1000 నుంచి 1,200 లతో ఢిల్లీ చేరుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..