Indian Railways: IRCTC పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరేం పర్వాలేదు.. ఇలా టికెట్ బుక్ చేసుకోండి..

|

Apr 01, 2023 | 6:48 AM

ప్రపంచలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశాలలో మన భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా తమ తమ గమ్య స్థానాలకు చేరుతారు. అయితే, ట్రైన్ ప్రయాణానికి టికెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. అందుకే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటారు.

Indian Railways: IRCTC పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరేం పర్వాలేదు.. ఇలా టికెట్ బుక్ చేసుకోండి..
Irctc Password
Follow us on

ప్రపంచలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశాలలో మన భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా తమ తమ గమ్య స్థానాలకు చేరుతారు. అయితే, ట్రైన్ ప్రయాణానికి టికెట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. అందుకే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటారు. అయితే, అందరూ స్టేషన్‌కు వెళ్లి టికెట్ తీసుకోవాలంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. గంటల తరబడి, భారీ క్యూ నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టికెట్ బుకింగ్స్ కోసం రైల్వే శాఖ వెబ్‌సైట్, యాప్ రూపొందించింది. వీటి సాయంతో ప్రయాణికులు తమ తమ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం.. ప్రయాణికులు రైల్వే డిపార్ట్‌మెంట్ అధికారిక సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులు తమ ట్రైన్ టికెట్‌లను ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే.. స్టేషన్‌ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు IRCTC యాప్, వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ప్రయాణికులు అప్పటి అవసరం మేరకు ఐఆర్‌సీటీసీలో అకౌంట్‌ క్రియేట్ చేస్తారు. కానీ, ఇతర పనుల కారణంగానో, మరే ఇతర అంశాల కారణంగానో ఐడీ, పాస్ వర్డ్ మర్చిపోతుంటారు. అలాంటి సమయంలో టికెట్ బుకింగ్‌లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పాస్‌వర్డ్ మర్చిపోయినప్పటికీ టిక్కెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. IRCTCకి ఇందుకోసం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాస్‌వర్డ్ రీసెట్, మరొకటి గెస్ట్ లాగిన్ ద్వారా టికెట్ బుకింగ్. గెస్ట్ లాగిన్‌తో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఎలాంటి ఖాతా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ద్వారా టిక్కెట్‌లను ఎలా బుక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

మీ పాస్‌వర్డ్ మర్చిపోతే ఏం చేయాలంటే..

1. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ https://www.irctc.co.in/nget/train searchకి వెళ్లాలి.

2. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్లాలి. ఇక్కడ కింద మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? అని ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. ఆ తర్వాత, మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం అడగడం జరుగుతుంది. ID, పుట్టిన తేదీ ఇందులో ముఖ్యమైన వివరాలు. ఆ తర్వాత కింద ఇచ్చిన క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ నమోదిత ఇమెయిల్‌కు మెసేజ్ పంపబడుతుంది.

4. ఈ మెసేజ్ ద్వారా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయవచ్చు. ఆ తర్వాత కొత్త పాస్‌వర్డ్‌తో మళ్లీ లాగిన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ప్రతిసారీ టికెట్ బుకింగ్ సమయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. మీ ID, పాస్‌వర్డ్‌ను ఎక్కడైనా నోట్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్ సమయంలో చాలా సమయం ఆదా చేస్తుంది. మీకు ఇష్టమైన సీటు పొందడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..