IRCTC Shri Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీ రామాయణ యాత్ర ఎక్స్ ప్రెస్ పర్యాటకను మరిన్ని రైళ్లు..

|

Sep 23, 2021 | 10:13 PM

మీరు శ్రీ రామాయ‌ణ యాత్ర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా.. దేఖో అప్నా దేశ్ అనే పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇన్షియేటివ్‌లో భాగంగా భార‌తీయ రైల్వేస్ స్పెష‌ల్ టూరిస్ట్ ట్రైన్లను ప్రారంభిస్తోంది. దేశంలో..

IRCTC Shri Ramayan Yatra: రామ భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీ రామాయణ యాత్ర ఎక్స్ ప్రెస్ పర్యాటకను మరిన్ని రైళ్లు..
Ramayana Circuit Special Tr
Follow us on

మీరు శ్రీ రామాయ‌ణ యాత్ర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా.. దేఖో అప్నా దేశ్ అనే పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇన్షియేటివ్‌లో భాగంగా భార‌తీయ రైల్వేస్ స్పెష‌ల్ టూరిస్ట్ ట్రైన్లను ప్రారంభిస్తోంది. దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ .. శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైళ్లను ప్రారంభిస్తోంది. 17 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో శ్రీరాముడి భ‌క్తులు దేశంలోని అధ్యాత్మిక కేంద్రాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

రామాయణ చిత్రాలతో అలంకరించబడిన రైలులో రాముడితో సంబంధం ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను చుట్టి రావాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. హిందువుల్లో రామాయణ ఇతిహాసానికి ఉన్న ప్రాధాన్యత చెప్పలేనిది. ధర్మబద్ధమైన జీవినానికి మార్గదర్శకంగా ఈ గ్రంధాన్ని ఇవాళ్టి తరంకు ఆదర్శంగా తీసుకుంటోంది. అటువంటి రామాయణ నేపధ్యంతో కూడిన పర్యాటక రైళ్లను భారతీయ రైల్వే ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

రామాయణం జరిగిందనడానికి నేటికీ ప్రత్యక్ష్య సాక్ష్యాలుగా నిలిచే అనేక ప్రదేశాలను ఈ రైలు ద్వారా యాత్రికులు సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ నుంచి తాజాగా రామాయణ ఎక్స్ ప్రెస్ మరో ఎడిషన్ ను ప్రారంభించబోతున్నట్లు రైల్వే బోర్డ్  తాజా ప్రకటనలో తెలిపింది.

IRCTC లో టికెట్ బుకింగ్‌..

న‌వంబ‌ర్ ఏడో తేదీన ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ రైల్వే స్టేష‌న్ నుంచి రామాయ‌ణ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర‌లో పాల్గొనే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో త‌మ టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌యాణికులంతా కోవిడ్‌-19 రెండు డోస్‌లు వేసుకున్న స‌ర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి. ఈ యాత్ర‌లో ప్ర‌యాణికులు సుమారు 7,500 కి.మీ. దూరం ప్ర‌యాణిస్తారు.

అయోధ్య: రామ‌జ‌న్మ‌భూమి దేవాల‌యం, హ‌నుమాన్ గ‌ఢీ, స‌ర‌యు ఘాట్‌
నందిగ్రామ్‌: భార‌త్‌-హ‌నుమాన్ టెంపుల్‌, భార‌త్ కుంద్‌
జ‌న‌క్ పూర్: రామ్ జ‌న‌క్ మందిర్‌
సీతా మ‌ర్హి: సీతామ‌ర్హిలోని జాన‌కి మందిర్‌, పునౌరా ధామ్‌
వార‌ణాసి: తుల‌సి మాన‌స్ టెంపుల్‌, సంక‌ట్ మోచ‌న్ టెంపు, విశ్వ‌నాథ్ టెంపుల్‌, సీతా సామాహిత్ స్థ‌ల్‌, సీతామ‌ర్హిలోని సీతా మాతా టెంపుల్‌.
ప్ర‌యాగ్‌: భ‌ర‌ద్వాజ్ ఆశ్ర‌మం, గంగా య‌మున సంగ‌మం, హ‌నుమాన్ దేవాల‌యం
శ్రీంగ‌వేర్పూర్: శ్రింఘే రిషి స‌మాధి అండ్ శాంతాదేవి టెంపుల్‌, రామ్ చౌరా
చిత్ర‌కూట్: గుప్త గోదావ‌రి, రామ్‌ఘాట్‌, భార‌త్ మిలాప్ టెంపుల్‌, స‌తి అన‌సూయ టెంపుల్‌
నాసిక్‌: త్రయంబ‌కేశ్వ‌ర్ టెంపుల్‌, పంచ‌వ‌టి, సీతా గుఫా, క‌ల‌రామ్ టెంపుల్‌
హంపి: అంజ‌నాద్రి హిల్‌, రిషిముఖ్ ఐలాండ్‌, సుగ్రీవ గుహ‌, చింతామ‌ణి టెంపుల్‌, మాల్య‌వంత ర‌ఘునాథ్ టెంపుల్.
రామేశ్వ‌రం: శివ టెంపుల్‌, ధ‌నుస్కోటి

ఒక IRCTC అధికారి ఈ రైలులో 156 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చని మొదటి రైలు బుకింగ్ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు.. రెండు రకాల వసతులను అందిస్తుంది. అయితే, అన్ని అదనపు రైళ్లు స్లీపర్ 3 ఏసీ క్లాస్ కోచ్‌లతో పనిచేస్తాయి. ఈ పర్యటన ప్యాకేజీ ధర కనిష్టంగా రూ .7,560 మరియు గరిష్టంగా రూ .16,065 మాత్రమే అని అధికారిక ప్రకటనలో తెలిపింది.

“ఈ పర్యాటక రైలులో కోవిడ్ -19 తర్వాత భద్రతా చర్యలను నిర్ధారించడానికి, 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల అతిథులకు కోవిడ్ -19 పూర్తి టీకాలు వేయడం తప్పనిసరి. ఇది కాకుండా, ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్ మరియు శానిటైజర్ ఉన్న పర్యాటకులందరికీ ఐఆర్‌సిటిసి సేఫ్టీ కిట్‌ను కూడా అందిస్తుంది “అని ఒక అధికారి తెలిపారు. 

ఇలా ప్యాకేజీలు..
ఫ‌స్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్ర‌యాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోట‌ళ్లు, మ‌రో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్‌ల్లో బ‌స చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల నుంచి ఆన్ బోర్డ్ వెజిటేరియ‌న్ భోజ‌న వ‌స‌తి క‌ల్పిస్తారు. ఏసీ వాహ‌నాల్లోనూ ఆయా ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌ వ‌చ్చు. ప్ర‌యాణికులంద‌రికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యం ఉంటుంది. ప్ర‌యాణికుల‌కు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తారు.

ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..